Ayodhya | జనవరి మూడో వారంలో.. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం

Ayodhya | 21,22,23తేదిల్లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం విధాత: అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్న ఆలయ ట్రస్టు వచ్చే ఏడాది జనవరి 21,22, 23తేదీల్లో రామమందిరం విగ్రహ ప్రతిష్టాప‌నోత్సవం, ప్రారంభోత్సవం, అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి అధికారికంగా ప్రధాని నరేంద్రమోదీకి సైతం ఆహ్వానం పంపనున్నట్లుగా ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా రామమందిరం నిర్మాణం లాంఛనంగా ప్రారంభించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేలా […]

  • Publish Date - August 4, 2023 / 01:13 AM IST

Ayodhya |

  • 21,22,23తేదిల్లో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం

విధాత: అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్న ఆలయ ట్రస్టు వచ్చే ఏడాది జనవరి 21,22, 23తేదీల్లో రామమందిరం విగ్రహ ప్రతిష్టాప‌నోత్సవం, ప్రారంభోత్సవం, అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి అధికారికంగా ప్రధాని నరేంద్రమోదీకి సైతం ఆహ్వానం పంపనున్నట్లుగా ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా రామమందిరం నిర్మాణం లాంఛనంగా ప్రారంభించి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేలా బీజేపీ వ్యూహానికి అనుగుణంగా మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రముఖ సాధువులు, ఇతర ప్రముఖులు కూడా హాజరవుతారని, కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా నిర్వహించబడుతుందని చంపత్‌రాయ్ తెలిపారు.

వివిధ రాజకీయ పార్టీల నుండి అతిథులను కూడా ఆహ్వానిస్తారని, వారు రావాలనే ఉద్దేశ్యం ఉంటే, కార్యక్రమంలో వేదిక లేదా బహిరంగ సభ ఉండదన్నారు. ఈ వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25,000 మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోందన్నారు.

అటువంటి సాధువుల జాబితాను ఆలయ ట్రస్ట్ సిద్ధం చేస్తుందని, త్వరలో వారికి ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సంతకంతో ఆహ్వాన పత్రాన్ని పంపనున్నట్లుగా, “అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ విడివిడిగా వసతి కల్పించాలని ట్రస్టు ప్లాన్ చేసిందని రాయ్ చెప్పారు.

రాంలాలా గర్భగుడి నిర్మాణం ముగింపు దశకు చేరుకుందని, ఇప్పుడు జనవరి నెలలో ‘ప్రాణ ప్రతిష్ఠ, ప్రారంభోత్సవానికి భారీ సన్నాహాలు సాగుతున్నాయని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.

అయోధ్యలో జరిగే ప్రారంభోత్సవ మహోత్సవానికి వచ్చే భక్తులకు దాదాపు నెల రోజుల పాటు ఉచితంగా భోజనం అందించాలని ట్రస్టు యోచిస్తోందన్నారు. జనవరి నెల మొత్తంలో ప్రతిరోజూ 75,000-1,00,000 మందికి ఆహారం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.

Latest News