Site icon vidhaatha

FDల‌పై వ‌డ్డీ రేట్లు పెంచిన.. రెండు ప్రైవేట్‌ బ్యాంకులు

విధాత: ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే మ‌న సేవింగ్స్‌ను పెంచుకోవ‌డానికి గొప్ప మార్గం. అయితే కొన్ని సంద‌ర్భాల్లో ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్లు త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, ఎఫ్‌డీలు చేయ‌కుండా వ‌దిలేస్తాం. కానీ ఇటీవ‌ల కాలంలో కొన్ని బ్యాంకులు, డిపాజిట్‌దారుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై కూడా వ‌డ్డీ రేట్లు పెంచుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీని పెంచాయి. ప‌లు ప్రైవేట్‌ బ్యాంకులు కూడా ఆ జాబితాలో వ‌చ్చి చేరాయి. అయితే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, క‌రూర్ వైశ్యా బ్యాంకు ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి.

ప్ర‌భుత్వ రంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(BOI) ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన మ‌రుస‌టి రోజే రూ.2 కోట్లలోపు డిపాజిట్ల‌పై బీవోఐ వ‌డ్డీని స‌వ‌రిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాలలోపు కాల‌పరిమితి క‌లిగిన ట‌ర్మ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీని 2.85 శాతం నుంచి 5.75 శాతం వ‌ర‌కు ఆఫ‌ర్ చేస్తుంది బీవోఐ. 555 రోజుల కాల‌ప‌రిమితి క‌లిగిన డిపాజిట్ల‌పై 6.05 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది కూడా. ఇక సీనియ‌ర్ సిటిజెన్ల‌కు మాత్రం అర శాతం అధికంగా వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు బీవోఐ ప్ర‌క‌టించింది.

క‌రూర్ వైశ్యా బ్యాంక్(KVB) కూడా ఎఫ్‌డీల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచేసింది. 31 రోజుల నుంచి 10 ఏండ్లలోపు కాలపరిమితి కలిగిన రూ.2 కోట్లలోపు డిపాజిట్లపై వడ్డీని సవరించింది. ఏడు రోజుల నుంచి 30 రోజుల లోపు టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేటును మాత్రం యథాతథంగా 4 శాతంగా ఉంచింది. అలాగే 31 రోజుల నుంచి 45 రోజుల లోపు వడ్డీరేటును 4 శాతం నుంచి 5.25 శాతానికి పెంచింది. 46 నుంచి 90 రోజుల కాలపరిమితి కలిగిన వడ్డీరేటును కూడా 4.25 శాతం నుంచి 5.25 శాతానికి చేరింది.

గతంలో 4.5 శాతం వడ్డీని చెల్లించిన 91-120 రోజుల ఎఫ్‌డీలపై ఈసారి దీనిని 5.25 శాతానికి పెంచగా.. 121 నుంచి 180 రోజుల వడ్డీని కూడా 4.5 శాతం నుంచి 5.50 శాతానికి సవరించింది. 181-270 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీని 5.75 శాతం ఆఫర్‌ చేస్తుండగా, 271 నుంచి ఏడాది లోపు 5.90 శాతం, ఏడాది నుంచి రెండేండ్లలోపు 6.10 శాతం, రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు 6.10 శాతం, మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీని 6.10 శాతం వరకు చెల్లిస్తున్నది. సీనియర్‌ సిటిజన్లకు మాత్రం మరో అర శాతం అదనంగా బ్యాంక్‌ చెల్లిస్తున్నది.

Exit mobile version