న్యూఢిల్లీ : దేశంలో కరోనా అలజడి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 116 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. కరోనాతో కర్ణాటకలో ముగ్గురు మృతి చెందినట్లు పేర్కొంది.
కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1 కేసుల సంఖ్య 63కు చేరింది. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే కొత్తగా 628 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సోమవారం కేరళలో ఒక్కరు మాత్రమే చనిపోయారు.
ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,170కి చేరుకుంది. కరోనాతో ఇప్పటి వరకు 5,33,337 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,72,153 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండగా, మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా పాజిటీవ్ రోగులు మృతి చెందారు. ఆ ఇద్దరికీ ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరో ముగ్గురికి ఐసోలేషన్‌లో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. ఒకవైపు చలి తీవ్రత పెరుగడం, వాయు కాలుష్యం, సమూహ జనాల రద్ధీ వంటి కారణాలు కూడా కరోణ విస్తరణకు కారణమవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 55 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.