India vs South Africa | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్-జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) దృష్ట్యా ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ చాలా కీలకం కానుంది.
టీ20 సిరీస్‌తో షురూ..
భారత జట్టు పర్యటన డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 డర్బన్‌లో జరగనుంది. రెండో టీ20 డిసెంబర్ 12న క్యూబెర్హాలో, మూడో టీ20 డిసెంబర్ 14న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఆ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్‌లో తలపడనున్నాయి.
డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్..
డిసెంబరు 17న జోహన్నెస్‌బర్గ్‌లో తొలి వన్డే, డిసెంబర్ 19న క్యూబెర్హాలో రెండో వన్డే, డిసెంబర్ 21న పార్ల్‌లో మూడో వన్డే జరగనున్నాయి. ఆ తర్వాత ఇరు జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్నాయి. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 30 వరకు సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. జనవరి 3 నుంచి జనవరి 7 వరకు కేప్‌టౌన్‌లో రెండో టెస్టు జరగనుంది.
బీసీసీఐ కార్యదర్శి జై షా ఏమన్నారంటే..
ఈ సందర్భంగా బీసీసీఐ సెక్రటరీ జయ్ షా మాట్లాడుతూ – ఫ్రీడమ్ సిరీస్‌లో రెండు అత్యుత్తమ జట్లు పోటీపడడంతో పాటు మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాలకు నివాళులు అర్పించేందుకే ముఖ్యమైనదని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో బాక్సింగ్ డే టెస్ట్, న్యూ ఇయర్ టెస్ట్ అత్యంత ముఖ్యమైన ఈవెంట్‌లలో ఒకటి అన్నారు. ఈ తేదీలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా షెడ్యూల్‌ను రూపొందించినట్లు చెప్పారు. భారతదేశానికి దక్షిణాఫ్రికా నుంచి ఎప్పుడూ మద్దతు లభిస్తుందని, అభిమానులను సిరీస్ అలరిస్తుందని భావిస్తున్నానన్నారు. క్రికెట్ దక్షిణాఫ్రి చైర్మన్ లాసన్ నాయుడూత మాట్లాడుతూ భారత జట్టు పర్యటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. మూడు ఫార్మాట్లలో ఆరుజట్లు ఆడబోడం ఆనందంగా ఉందని, బీసీసీఐతో మాకు మంచి సంబంధాలున్నయన్న ఆయన.. మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
షెడ్యూల్ ఇలా..
మొదటి టీ20 : డర్బన్ – డిసెంబర్ 10
రెండో టీ20 : క్యూబెర్హా – 12 డిసెంబర్
మూడో టీ20 : జోహన్నెస్‌బర్గ్ – డిసెంబర్ 14
తొలి వన్డే : జోహన్నెస్‌బర్గ్ – డిసెంబర్ 17
రెండో వన్డే : క్యూబెర్హా – 19 డిసెంబర్
మూడో వన్డే : పార్ల్ – డిసెంబర్ 21
ఫస్ట్ టెస్ట్ : సెంచూరియన్ – డిసెంబర్ 26-30
సెకండ్ టెస్ట్ : కేప్ టౌన్ – 3-7 జనవరి (2024)
BCCI and @ProteasMenCSA announce fixtures for India’s Tour of South Africa 2023-24.
For more details – https://t.co/PU1LPAz49I #SAvIND
A look at the fixtures below