Site icon vidhaatha

దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో ఇండియా విజయం

విధాత : దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను 116కు అలౌట్ చేసింది. అనంతరం 2వికెట్లు మాత్రమే కోల్పోయి 117పరుగుల లక్ష్యాన్ని 16.4ఓవర్లలోనే చేధించి 8వికేట్లతో విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్‌(52), సాయి సుదర్శన్‌(55)లు హాప్ సెంచరీలతో భారత్ విజయంలో కీలక భూమిక పోషించారు. రుతురాజ్ గైక్వాడ్‌(5)పరుగులకే అవుటయ్యాడు. అంతకుముందు తొలి వన్డే ఆడిన భారత పేసర్ అర్షదీప్ సింగ్ 5వికెట్లు, ఆవేశ్‌ఖాన్ 4వికేట్లు సాధించారు. భారత్ తరపునా దక్షిణాఫ్రికాలో ఐదు వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అర్షదీప్ సింగ్ రికార్డు సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 116పరుగులకే అలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో పెలుక్వాయో (33)పరుగులే టాప్ స్కోర్‌గా ఉంది.

Exit mobile version