Site icon vidhaatha

Raj Chetty | ఆర్థికవేత్త రాజ్ చెట్టికి హార్వర్డ్ వర్సిటీ అవార్డు

Raj Chetty | విధాత‌: ప్రముఖ ఇండియ‌న్‌-అమెరికన్ ఆర్థికవేత్త రాజ్ చెట్టికి ప్ర‌ఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ (Harvard University) అత్యున్న‌త పుర‌స్కారం ద‌క్కింది. ఇతరులు క‌ల్పించే అపోహ‌లు, అడ్డంకుల‌ను ఛేదించ‌డానికి బిగ్‌డేటాను సృష్టించినందుకుగాను రాజ్ చెట్టికి ప్ర‌ఖ్యాత‌ జార్జ్ లెడ్లీ (George Ledlie) బహుమతి లభించింది.

రాజ్‌చెట్టితోపాటు కొవిడ్ (COVID-19) మ‌హ‌మ్మారి వ్యాప్తిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి మెరుగైన, వేగవంతమైన పరీక్షా విధానాన్ని రూపొందించిన హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని సిస్టమ్స్ బయాలజీ ప్రొఫెసర్ అయిన బయాలజిస్ట్ మైఖేల్ స్ప్రింగర్ (Michael Springer) కూడా హార్వర్డ్ వ‌ర్సిటీ జార్జ్ లెడ్లీ ప్రైజ్ ల‌భించింది.

ఆర్థిక‌రంగంలో విశేష కృషిచేసిన 40 ఏండ్ల‌లోపు అమెరికన్ ఆర్థికవేత్తల‌కు జార్జ్ లెడ్లీ అవార్డును ప్రదానం చేస్తారు. ఈ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ సంతతి వ్యక్తి చెట్టి కావ‌డం విశేషం. ఢిల్లీలో జన్మించిన రాజ్ చెట్టి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకానమీ విభాగంలో ప్రొఫెసర్‌గా ప‌నిచేశారు.

Exit mobile version