Site icon vidhaatha

Indian Army | క‌శ్మీర్‌లో సైనికుడిని.. కిడ్నాప్ చేసిన ఉగ్ర‌వాదులు?

Indian Army

విధాత‌: క‌శ్మీర్‌లోని కుల్గాం ప్రాంతానికి చెందిన ఓ సైనికుడు అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. జావేద్ అహ్మ‌ద్ వానీ అనే సైనికుడి ఆచూకీ ప్ర‌స్తుతం తెలియ‌డం లేదని ఆర్మీ ప్ర‌క‌టించింది.

అత‌డి కారులో ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను గుర్తించామ‌ని.. ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశామ‌ని ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. అత‌డికి వ్య‌క్తిగ‌త కార‌ణాలేమైనా ఉన్నాయా? లేదా ఉగ్ర‌వాదులు అప‌హ‌రించారా అన్న కోణంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ల‌ద్దాఖ్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న జావేద్‌.. ఇటీవ‌లే సెల‌వులు పెట్టి క‌శ్మీర్‌కు వ‌చ్చాడు. చివ‌రి సారిగా అత‌డు చోలాగాం ఆనే ప్రాంతంలో షాపింగ్ చేసినట్లు కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఈ ప‌రిణామంపై భాజ‌పా స్పందించింది.

అమాయ‌క ప్ర‌జ‌ల‌ను లక్ష్యంగా చేసుకోవ‌డం ఉగ్ర‌వాదుల‌కు ఈ మ‌ధ్య అల‌వాటుగా మారింద‌ని ఆ పార్టీ నాయ‌కుడు అల్తాఫ్ ఠాకుర్ మండిప‌డ్డారు. ఈ కిడ్నాప్‌కు పాల్ప‌డిన వారిని చ‌ట్టం ప‌రిధిలో క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version