విధాత, హైదరాబాద్ : భారత సరిహద్దుల రక్షణ సైనికులకు (Indian soldiers)ఎంతో క్లిష్టమైన బాధ్యతలతో కూడుకున్నది. దేశానికి ఓ వైపు ఎత్తైన హిమాలయ పర్వతాలు..మరోవైపు ఏడారులు, సముద్రాలు. దీంతో భిన్న ప్రతికూల వాతావారణ పరిస్థితులు మధ్య ఇండియన్ ఆర్మీ దేశ రక్షణ కొనసాగించాల్సి వస్తుంది. ఓవైపు శత్రు దాడులను కాచుకోవడం..మరోవైపు వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉండటం సైనికులకు నిత్య యుద్దంగానే చెప్పవచ్చు.
ముఖ్యంగా చైనా, పాక్ సరిహద్దుల్లో ఎత్తైన హిమాలయ మంచుకొండలపై -20°C నుంచి -60C ఉష్ణోగ్రతల వద్ద విధులు నిర్వహిస్తున్న సైనికుల సాహసంపై ఎంత చెప్పిన తక్కువే. సియాచీన్ ప్రాంతమైతే సముద్ర మట్టానికి16,000 అడుగుల ఎత్తులో అత్యంత శీతల ప్రాంతంగా..ప్రపంచంలోనే ఎత్తైన యుద్ద క్షేత్రంగా కొనసాగుతూ సైనికుల ప్రాణాలతో చెలగాటమాడుతుంటుంది. ఒక్కోసారి ఇక్కడ ఉష్ణోగ్రతలు – -60Cవరకు కూడా పడిపోతుంటాయి. ఆక్సిజన్ కూడా ప్రమాదకర స్థాయిలో అందకుండా పోతుంది.
రక్తం గడ్డకంటే చలి..ప్రమాదాల మంచుదారుల మధ్య సైనికులు నిత్యం పహారా కాస్తున్నారు. తాజాగా అక్కడి భారత సైనికులు -20°C చలిలో దేశ రక్ష విధులు నిర్వహిస్తూ..దేశ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు(Indian Army New Year greeting) చెబుతూ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అది చూసిన నెటిజన్లు మీ ధైర్యం, త్యాగం, అచంచల నిబద్ధత దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాయని..మన నిజమైన హీరోలకు వందనం అంటూ కామెంట్లు పెడుతూ లైక్ లు కొడుతున్నారు.
New Year wishes to the brave #IndianArmy warriors standing guard for us even at –20°C. Your courage, sacrifice and unwavering commitment keep the nation safe. Salute to our real heroes.🇮🇳#HappyNewYear2026 pic.twitter.com/9usXkTn20r
— Manish Prasad (@manishindiatv) January 1, 2026
