Jammu Kashmir : జమ్మూ కశ్మీర్ లో గ్రామ రక్షణ దళాలు..ఆర్మీ ట్రైనింగ్

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ దళాలకు ఇండియన్ ఆర్మీ సాయుధ శిక్షణ ఇస్తోంది. మహిళలు కూడా శిక్షణలో పాల్గొంటున్నారు.

Indian Army training Village Defence Guards

విధాత : టెర్రరిజం సమస్యలతో సతమతమవుతున్న జమ్మూ కశ్మీర్ వాసుల సంరక్షణకు ఇండియన్ ఆర్మీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. సరిహద్దు గ్రామాల్లో టెర్రరిస్టు దాడులను ఎదుర్కొనేందుకు స్థానికులకు సాయుధ శిక్షణ అందిస్తున్నారు. ఇందులో భాగంగా
భారత సైన్యం జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో గ్రామ రక్షణ దళాలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయుధాల వాడకం, ఆత్మరక్షణ, ప్రాథమిక పోరాట నైపుణ్యాలపై స్థానికులకు శిక్షణ ఇస్తున్నారు.

17 గ్రామాలకు చెందిన సుమారు 150 మంది వాలంటీర్లు ఆయుధాల నిర్వహణ, ఆత్మరక్షణలో శిక్షణ పొందుతున్నారు. గ్రామ రక్షణ దళాలకు వారి గ్రామాలను పర్యవేక్షించడం, రక్షించుకోవడంలో అవసరమైన సాయుధ నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కొండలు, లోయల ప్రాంతాలలో శతృవులు దాడులను ఎదుర్కోవడంలో అనుసరించాల్సిన పోరాట ఎత్తుగడలపై వారికి తర్ఫీదు ఇస్తున్నారు.

రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్ ద్వారా గ్రామస్తులకు ఆటోమేటిక్ ఆయుధాలను నిర్వహించడం, బంకర్ల రక్షణ, ఎదురుదాడి చర్యలపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందుతున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఈ శిక్షణ స్థానిక గ్రామాల ప్రజల భద్రతను బలోపేతం చేస్తుందని, అనూహ్య దాడులను తిప్పికొట్టడంతో ఉపయోగపడుతుందని ఆర్మీ భావిస్తుంది. ఇదంతా తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల నుంచి రక్షణకు ఆనాడు గ్రామసంఘాలు కమ్యూనిస్టుల యోధుల ద్వారా పొందిన పోరాట శిక్షణను తలిపించేలా ఉండటం విశేషం.

ఇవి కూడా చదవండి :

Sridevi | అతిలోక సుందరి శ్రీదేవి.. తెర వెనుక తెలియని రేర్ ఫ్యాక్ట్స్, సంచలన ట్విస్టులు
Republic Day : గణతంత్ర పరేడ్ లో ఆర్మీ న్యూ స్టెప్.. తొలిసారిగా ఆ జంతువులు

Latest News