WhatsApp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp)కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంటుంది. తాజాగా సంస్థ తన యూజర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వెబ్ వెర్షన్ (Web version) లో కొత్త ఫీచర్ (New feature)ను తీసుకొచ్చింది.
కొత్తగా వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు ఇకపై ఎలాంటి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ లేకుండానే నేరుగా వెబ్ నుంచే ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ వెబ్ ను బీటా వెర్షన్ గా వాడుతున్న వారికి మాత్రమే ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాదిరిగా వాట్సప్ వెబ్ నుంచి చేసే కాల్స్‌కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుంది. దీనివల్ల సంభాషణలు పూర్తిగా గోప్యంగా ఉంటాయి.
ఈ ఫీచర్‌ను ప్రస్తుతం మొదటి దశలో భాగంగా పరీక్షిస్తున్నారు. ఇందులో వ్యక్తిగత చాట్స్‌లో మాత్రమే వాయిస్ లేదా వీడియో కాల్స్‌ను చేసుకునే వీలు కల్పించారు. వెబ్ వెర్షన్‌లో వ్యక్తిగత చాట్ ఓపెన్ చేసి అందులో కనిపించే వాయిస్ లేదా వీడియో కాల్ అనే ఐకాన్‌పై క్లిక్ చేసి కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ వెబ్ వినియోగం మరింత సులభతరం కానుంది. మరో విశేషం ఏంటంటే.. ఇక వీడియో కాలింగ్ సమయంలో స్క్రీన్‌ను షేర్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
వాట్సాప్ వెబ్ ఇన్నాళ్లూ కేవలం మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపించుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఎలాంటి కాల్స్ మాట్లాడుకునేందుకు వీలుండేది కాదు. వాట్సాప్ ద్వారా కాల్స్ మాట్లాడాలంటే తప్పనిసరిగా మొబైల్ ఫోన్ లేదా విండోస్, మ్యాక్ డెస్క్‌టాప్ యాప్‌లపై ఆధారపడాల్సి వచ్చేది. తాజా అప్‌డేట్‌తో ఈ ఇబ్బంది తొలగిపోయింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు, స్నేహితులతో మాట్లాడటం వంటి వాటికి ల్యాప్‌టాప్, కంప్యూటర్ ద్వారా వాట్సాప్ వెబ్ వాడేవారికి ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక వెబ్ వెర్షన్‌లోనే గ్రూప్ కాలింగ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ
HYDRA : ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..రూ.1511 కోట్ల భూముల పరిరక్షణ
