న్యూఢిల్లీ : తెలంగాణకు చెందిన మహ్మద్ అష్ఫాక్ హుస్సెన్(38) అనుమానస్పద స్థితిలో భారత్ పాక్ సరిహద్దుల్లో సంచరిస్తుండగా బీఎస్ఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలో నిషేధిత సరిహద్దు ప్రాంతంలో హుస్సేన్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో స్థానిక గ్రామస్థులు ప్రశ్నించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో బీఎస్‌ఎఫ్‌కు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న బీఎస్‌ఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. హుస్సెన్ వద్ద నుంచి భారత పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ నుంచి జైసల్మేర్ ప్రాంతంలోని పాక్ సరిహద్దుకు ఎందుకు వచ్చాడు? స్థానికంగా ఎవరినైనా కలిసేందుకు వచ్చాడా? లేక ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అన్నదానిపై బీఎస్‌ఎఫ్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విచారణ కొనసాగిస్తున్నాయి.
