CM Revanth Reddy: : రాష్ట్ర సమాచార కమిషన్ (ఆర్టీఐ) కు కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్ లు తమ కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కమిషనర్లుగా తమను నియమించినందుకు వారంతా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
వారు మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఆ పదవిలో ఉండనున్నారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా ఐఎఫ్ఎస్ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి నియామతులవ్వగా ఆయన ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.