IPL-2023 |
విధాత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ నేటి నుంచి మొదలవనున్నది. ఇక లీగ్‌లో మన సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్నది. ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనున్నది.
ఐపీఎల్ గత సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. పాయింట్ల పట్టికలో ఎనిమిది స్థానంలో నిలిచింది. వాస్తవానికి గత సీజన్ గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. జట్టుకు ఎంతో బలమైన ఆటగాడు డేవిడ్ వార్నర్‌ను మేనేజ్‌మెంట్ వదులుకున్నది. అలాగే సీనియర్ ఆటగాడైన కేన్ విలియమ్స్‌ను సైతం విడుదల చేసింది.
ఆ తర్వాత మళ్లీ వార్నర్ అంతటి స్టార్ ఆటగాడిని సైతం వేలంలో దక్కించుకోలేకపోయింది. వేలంలో మిగతా ఫ్రాంచైజీలు పోటీపడి ఆటగాళ్లను దక్కించుకుంటే మేనేజ్‌మెంట్ కళ్లప్పగించి చూసిందే తప్ప.. స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయలేక మిన్నకుండిపోయింది. చివరకు సాధారణ, అనుభవం లేని ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నది.
గత సీజన్‌లో మొత్తం 14 మ్యాచులాడిన హైదరాబాద్ జట్టు 6 విజయాలు, 8 పరాజయాలతో ఎనిమిదో స్థానానికే పరిమితమైంది. 16వ సీజన్‌లో కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్, కొత్త కోచ్ బ్రియాన్ లారా నేతృత్వంలో సన్ రైజర్స్ బరిలోకి దిగనున్నది. ఈ సారైనా హైదరాబాద్ జట్టు రాణించి.. టైటిల్‌ను సాధించాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఫైర్ బ్రాండ్