Site icon vidhaatha

Hyderabad | ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్టు

మియాపూర్ నుంచి దందా

విధాత, హైదరాబాద్‌ :ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మియాపూర్ లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న గుంటూరుకు చెందిన శాఖమూరి వెంకటేశ్వర్‌రావుతో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50 లక్షల నగదు స్వాధీనం చేసున్నారు.

అధునాతన పరికరాలతో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఐపీఎల్ బెట్టింగ్‌ల పట్ల ఆకర్షితులై కేసుల్లో ఇరుక్కోవద్ధంటూ ఈ సందర్భంగా పోలీసులు యువతకు సూచించారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ను బెట్టింగ్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. సులభంగా పెట్టిన పెట్టుబడిగా అదనంగా భారీగా సంపాదించవచ్చన్న ఆశతో బెటింగ్‌ల్లోకి దిగుతున్న యువత ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కేసుల పాలవుతున్నారు.

Exit mobile version