విధాత: ఐపీఎస్ నవీన్ కుమార్ ను బుధవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌కుమార్ పోలీస్ అకాడమీ ఎస్పీగా పని చేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంట్లో అద్దెకు ఉంటున్న నవీన్ కుమార్ ఫేక్ డ్యాక్యుమెంట్లను సృష్టించి ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కోంటున్నారు.
ఈ కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్‌ను అరెస్టు చేశారు. ఏకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటినే అక్రమంగా సొంతం చేసుకోవాలనుకున్న నవీన్ కుమార్ పనితీరు..ఆయన ఇప్పటిదాకా ఎక్కడెక్కడ పనిచేశారన్న అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపింది..