IRCTC Tirumala Package | తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లానుకుంటున్నారా? రూ.4వేలకే బంపర్‌ ప్యాకేజీని తీసుకువచ్చిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Tirumala Package | వేసవిలో ఎండలు మండుతున్నాయి. పాఠశాలలకు ఇప్పటికే సమ్మర్‌ హాలీ డేస్‌ వచ్చేశాయ్‌. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు చాలామంది ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. పర్యాటక ప్రాంతాలతో పాటు దేవాలయాలను సందర్శించాలని భావిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా రద్దీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘గోవిందం’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. రెండు రాత్రులు, మూడు రోజులు ప్యాకేజీ కొనసాగనున్నది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ […]

  • Publish Date - April 25, 2023 / 03:49 AM IST

IRCTC Tirumala Package |

వేసవిలో ఎండలు మండుతున్నాయి. పాఠశాలలకు ఇప్పటికే సమ్మర్‌ హాలీ డేస్‌ వచ్చేశాయ్‌. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లేందుకు చాలామంది ప్లాన్‌ చేసుకుంటూ ఉంటారు. పర్యాటక ప్రాంతాలతో పాటు దేవాలయాలను సందర్శించాలని భావిస్తుంటారు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయానికి భారీగా రద్దీ ఎక్కువైంది. ఈ క్రమంలోనే IRCTC ప్రత్యేక ప్యాకేజీని తీసుకువచ్చింది.

‘గోవిందం’ పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులో ఉంచింది. రెండు రాత్రులు, మూడు రోజులు ప్యాకేజీ కొనసాగనున్నది. ఈ ప్యాకేజీ ప్రతి రోజూ అందుబాటులో ఉంటుంది. ఎవరైనా రెండు, మూడు రోజులు తిరుపతి వెళ్లాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగ పడునున్నది. ప్యాకేజీ ధర రూ.4వేల లోపే ఉండడం మరో విషయం.

ఈ ప్యాకేజీలో మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇందులోనే తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్ కవర్‌ కానున్నాయి. ప్యాకేజీలో బుక్‌ చేసుకున్న పర్యాటకులు 12734 నంబరుగల రైలు ఎక్కాల్సి ఉంటుంది. ఈ రైలు ప్రతిరోజూ సాయంత్రం 5.25 గంటలకు లింగంపల్లి, 6.10 గంటలకు సికింద్రాబాద్‌, 7.38 గంటలకు నల్గొండలో ఆగుతుంది. తొలిరోజు రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.

రెండో రోజు తెల్లవారు జామున 5.55 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ఉదయం 9 గంటలకు తిరుమలలో శ్రీవారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకునే అవకాశం ఉంటుంది. దర్శనం అనంతరం తిరుపతికి చేరుకోవాలి.

IRCTC Kerala Tour | మండుటెండల్లో కేరళలో చల్లని టూర్‌..! బంపర్‌ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే..!

హోటల్‌ లంచ్‌ చేసిన అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది. 6.25 గంటలకు 12733 నంబరు గల రైలు ఎక్కాలి. మూడోరోజు తెల్లవారు జామున 5.35 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

Tirumala | తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు

Latest News