Vastu | ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాగే ఇంట్లో ఓ పూజ గదిని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అది వీలుకాని పక్షంలో అక్కడక్కడ పలు రకాల దేవుండ్ల ఫోటోలు పెట్టుకుంటారు.
అయితే ఈ దేవుండ్ల ఫోటోల విషయంలో వాస్తు నిపుణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దేవతామూర్తుల ఫోటోలను ఎక్కడ అంటే అక్కడ ప్రదర్శించొద్దని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో ఈ ఆరు రకాల ఫోటోలు ఉంటే.. ఏ ఇబ్బందులు రాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిపి వస్తాయని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు.
ఆ ఆరు రకాల ఫోటోలు ఏంటో చూద్దాం..
పంచముఖ ఆంజనేయస్వామి.. ఈ దేవుడి ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందట. అయితే ముఖ్యంగా నిల్చున్న ఆంజనేయ స్వామిని పెట్టుకోని పూజ చేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ఫోటోను ప్రత్యేక పూజ గది ఉంటేనే పెట్టుకోవాలి. లేదంటే ఇంటి ద్వారానికి పైన పెట్టుకోవచ్చని సూచిస్తున్నారు. దీని వల్ల ఎటువంటి చెడు దృష్టి ఇంటిపై పడదని సూచిస్తున్నారు.
రైలు ఎక్కుతుండగా జారిపడ్డ చిన్నారి.. కాపాడిన రైల్వే పోలీసు.. వీడియో
నరసింహ్మా స్వామి.. ఇంట్లో ఉత్తర ముఖంగా ఉంటే శత్రు బాధలు తొలగిపోతాయని జోతిష్యులు చెబుతున్నారు.
లక్ష్మీవరాహమూర్తి.. ఉత్తరముఖంగా ఉంటే గ్రహ దోషాల నుంచి తప్పించుకోవచ్చట. అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట.
మహావీర గరుడస్వామి.. ఈ దేవుడి ఫోటోను పడమర ముఖంగా పెట్టుకోవడం వల్ల దుష్ట ప్రభావాలు తొలగి.. శరీరంలో ఉండే విషపదార్థాల నుంచి రక్షిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు.
హయగ్రీవ స్వామి.. ఊర్థ్వంగా ఉండే హయగ్రీవ స్వామిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జ్ఞానాన్ని, సంతానాన్ని ప్రసాదిస్తాడట.
లక్ష్మీ దేవి.. ఏ ఇబ్బందులు రాకుండా అష్ట ఐశ్వర్యాలు కలిసివస్తాయట.
బీర్లకు అలవాటు పడ్డ కోతి.. మరి దొంగిలించి తాగేస్తోంది.. వీడియో వైరల్