Ismart Beauty | ఇస్మార్ట్ బ్యూటీ గుర్తు ప‌ట్ట‌కుండా మారిందేంటి.. బెంగ పెట్టుకుందా ఏమి?

Ismart Beauty | 2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ అనే చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. ఈ సినిమా న‌భాకి పెద్ద‌గా గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. 2018లో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ఫీల్‌ గుబ్‌ మూవీ నన్ను దోచుకుందువటే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. ఆ తర్వాత 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఈ భామ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇందులో న‌భా […]

  • Publish Date - August 13, 2023 / 02:07 AM IST

Ismart Beauty |

2015లో విడుదలైన కన్నడ చిత్రం ‘వజ్రకాయ’ అనే చిత్రంతో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. ఈ సినిమా న‌భాకి పెద్ద‌గా గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. 2018లో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన ఫీల్‌ గుబ్‌ మూవీ నన్ను దోచుకుందువటే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి.

ఆ తర్వాత 2019లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఈ భామ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఇందులో న‌భా న‌ట‌నికి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఒకవైపు మాస్ యాంగిల్‌లో అద‌ర‌గొడుతూ, మ‌రోవైపు అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది.

ఇస్మార్ట్ శంక‌ర్ న‌భాకి మంచి హిట్ ఇవ్వ‌డంతో ఈ భామ‌కి ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్,’ ‘మాస్ట్రో’, ‘అల్లుడు అదుర్స్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో ఏ సినిమా కూడా న‌భాకి ఒక్క మంచి హిట్ కూడా అందించ‌లేక‌పోయింది.

2021 త‌ర్వాత న‌భా న‌టించిన ఒక్క సినిమా విడుద‌ల కాలేదు. ఆ మధ్య న‌భా న‌టేష్‌ యాక్సిడెంట్ కు గురైంది. ఈ క్ర‌మంలో కొత్త సినిమాల‌కి కూడా సైన్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా కోలుకున్న‌ట్టు తెలుస్తుండ‌గా, నభా నటేష్ మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తుంది.

ఇటీవ‌ల రెండు మూడు ప్రాజెక్ట్ లు తన చేతిలో ఉన్నట్టు ప్రకటించింది న‌భా. అయితే ఇప్పటి వరకు వాటి అప్‌ డేట్ ఇవ్వ‌లేదు. సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ సంద‌డి చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఫుల్‌గా గ్లామ‌ర్‌ డోస్‌ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తూ అంద‌రిని ఆకట్టుకోవడంతో పాటు ఆలోచించేలా చేస్తుంది.

అవకాశాల కోసమే న‌భా న‌టేష్ ఇంత‌లా హాట్‌ డోస్‌ పెంచుతూ రెచ్చగొడుతుందా అని కొంద‌రు అనుమా నాలు వ్య‌క్తం చేశారు. తాజాగా న‌భా న‌టేష్ మేక‌ప్ లెస్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో న‌భా గుర్తు ప‌ట్ట‌కుండా ఉంది. స‌డెన్‌గా ఈ పిక్స్ చూసిన వారు ఎవ‌రు ఈమె అని ఆశ్చ‌ర్య‌పోక మాన‌రు.

నిత్యం అందమైన పిక్స్ షేర్ చేసే నభా.. మేకప్ లేకుండా పిక్స్ షేర్ చేయ‌డంతో బెంగ ఎక్కువైన‌ట్టుంది అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా అవ‌కాశాల కోసం న‌భా తీవ్రంగా కృషి చేస్తున్న‌ట్టుంది అని అంటున్నారు. ఏద‌మైన ఇప్పుడు న‌భా పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.