Site icon vidhaatha

IT Jobs | ఐటీ జాబ్స్‌లో.. 44శాతం తెలంగాణవే: కేటీఆర్‌

IT Jobs

విధాత: ఐటీ రంంగంలో దేశ పురోగతితో పోల్చితే తెలంగాణలో నాలుగురేట్లు అధికంగా ఉందని, దేశంలో టెక్నాలాజీ జాబ్స్‌లో 44శాతం తెలంగాణవేనని మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త రాష్ట్రం వచ్చాక ఐటీలో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమలను విస్తరిస్తున్నామని, ఇటీవల నల్లగొండ ఐటీ హబ్‌లో సోనాటా కంపెనీ ముందుకు వచ్చిందన్నారు. పాతబస్తీలో కూడా మలక్‌పేట్ మార్గంలో ఐటీ విస్తరణ ప్రయత్నాలు పురోగతిలో ఉన్నాయని వివరించారు.

ఐటీని తామే అభివృద్ధి చేశామని కొందరు నాయకులు చెప్పుకునేలా తాము చెప్పుకోమని, 1987లో తొలిసారిగా హైద్రాబాద్‌లో ఐటీ కంపెనీ ఇంటర్ గ్రాఫ్ సంస్థ ప్రారంభమైందన్నారు. 1987నుండి 27ఏళ్లలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 56వేల కోట్లు ఉంటే ఒక్క గత ఏడాదే 57వేల కోట్లు ఎగుమతులు సాధించడం జరిగిందన్నారు. నిన్న కోకాపేట భూముల వేలంలో ఎకరా రూ.100కోట్లు పలికితే కాంగ్రెస్ నాయకులు ఏదో కుంభకోణం జరుగుతుందని పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నార‌న్నారు.

దేశంలో కోకాపేట భూములు కొత్త రికార్డు నెలకొల్పాయని ఇది హైద్రాబాద్ పరపతికి నిదర్శమన్నారు. స్టేబుల్ గవర్నమెంట్‌, ఏబుల్ లీడర్ షిప్‌తో ఇది సాధ్యమైందన్నారు. ఇవాళ హర్యానాలో ఏమవుతుందని గురుగ్రామ్ వంటి గొప్ప ఐటీ సెంటర్ ప్రాంతంలో మత పంచాయతీలు సాగుతున్నాయని, మణిపూర్‌లో ఏం జరుగుతుందో చూశారని, తెలంగాణలో అలాంంటి పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ పాలన శ్రీరామ రక్షగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు.

మీకు వేరే ముఖ్యమంత్రి లేరు..కేటీఆర్‌

శాసన సభలో జీరో అవర్ అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం, పంచ్‌లతో సాగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు, జర్నలిస్టుల సమస్యలను ప్ర‌స్తావించగా, కేటీఆర్ బదులిస్తు సంగారెడ్డి వరకు మెట్రో అడిగితే ఇస్నాపూర్‌కు వరకు ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కళాశాలల్లో అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేసున్నామని, జర్నిలిస్టుల ఇండ్ల సమస్య సుప్రీంలో పెండింగ్‌లో ఉందన్నారు.

సీఎం కేసీఆర్ దీనిపై అప్పటి సీజే రమణతో స్వయంగా మాట్లాడారని చెప్పారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు నవ్వడంతో మా ముఖ్యమంత్రినే, మన ముఖ్యమంత్రినే స్వయంగా మాట్లాడర‌ని చెప్పానని, ఎందుకంటే మీకు వేరే ముఖ్యమంత్రి లేరని, మీ పార్టీలో పది మంది ఉండొచ్చని, కాని బయట రాష్ట్రానికి మాత్రం ఒక్కరే ఉంటారంటు చురకలేశారు. సీతక్క కూడా ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కళాశాలలు ఇచ్చినా సీతక్క, శ్రీధర్‌బాబులు థాంక్స్ చెప్పడంలేదని, అయినా ప్రభుత్వం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.

Exit mobile version