KTR |
ఎల్లారెడ్డి: ఎన్నికల్లో మందు పోసి, పైసలిచ్చి గెలవడం నాతోని కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్లారెడ్డిపేటలో రూ. 8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వేరే వేరే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ, ఇంకొకరు కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారు. నాకు అది చేత కాదు. నేను ప్రజాస్వామ్యంగా ప్రజలను నమ్ముకుని వచ్చిన వ్యక్తిని. ప్రజల దయ ఉంటే తప్పకుండా మళ్లీ గెలుస్తాను. నేను ఎలక్షన్‌లో మందుపోయను, డబ్బులివ్వను.
అది మీకెరుక.. నాకెరుక. బరాబర్ అట్లనే ఉంటా. నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. నేను పని చేశాను. పని చేస్తా, ప్రజలకు పనికొచ్చే మనిషిని నేను. మందు పోసి గెల్సుడు, పైసలిచ్చి గెల్సుడు ఆ రాజకీయం నాతోని కాదు. ప్రజల కోరుకున్నన్నాళ్లు సిరిసిల్లలో ఇక్కడే ఉంటాను. ఇక్కడే పని చేస్తాను. బరాబర్ మీ సోదరుడిగా పని చేస్తాను’ అని చెప్పారు. ఎల్లారెడ్డిపేటలో బడి కట్టించాలని తనను ఎవ్వరూ అడగలేదని కేటీఆర్ అన్నారు.
కానీ.. గంభీరావుపేటలో కేజీ టు పీజీ వరకు అందుబాటులోకి తెచ్చామని, పలకతోని వచ్చి.. పట్టా తీసుకొని పొమ్మని చెప్పామని తెలిపారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. మన ఊరు – మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. డిజిటల్ తరగతులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, నాణ్యమైన ఇంగ్లిష్ విద్యను అందిస్తున్నామని చెప్పారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ అనంతరం మాట్లాడుతున్న మంత్రి @KTRBRS https://t.co/uuxHrhTU06
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 20, 2023
బరాబర్ కాలేజీ వస్తది
ఎల్లారెడ్డి పర్యటనలో ఉన్న కేటీఆర్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బరాబర్ ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజీ వస్తది అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘నువ్వెవడో ఆందోళన చేసినందుకు కాదు. ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతోని కేసీఆర్ డిగ్రీ కాలేజీ ఇస్తారు.
కార్లకు అడ్డపడటం, ధర్నాలు చేయడం కాదు.. చేతనైతే, దమ్ముంటే.. కేంద్రం నుంచి ఓ రెండు కాలేజీలు, ఓ రెండు పరిశ్రమలు తీసుకురావాలి. సిరిసిల్ల నేతన్నల కోసం ఒక మెగా పవర్‌లూమ్ క్లస్టర్ తీసుకురావాలి. కరీంనగర్‌లో ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురా..? అలా విద్యలో పోటీ పడాలి’ అని బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.
Delighted to be inaugurating this beautiful Zilla Parishad High School at Yellareddypet in Rajanna Siricilla district tomorrow