విధాత: తెలుగులో కీర్తి సురేష్, సాయి పల్లవి వంటి వారి తర్వాత నటనలో సత్తా కలిగిన నటిగా అనుపమ పరమేశ్వరన్ పేరును చెప్పుకోవాలి. తనకున్న గ్లామర్‌తో పాటు టాలెంట్ కూడా తోడవడంతో ఆమె చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా నిఖిల్ హీరోగా నటించిన 18 పేజెస్ చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె తన కెరీర్ గురించి, తన అభిరుచులు, తన గోల్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
నటిగా నాకు ఎన్నో సినిమాల్లో నటించాలని ఉంది. ఇప్పటివరకు నేను ప్రేమకథా చిత్రాల్లోనే నటించాను. ఇలా మరింకా మరెన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని ఉంది. నాకు నటన కాకుండా డైరెక్షన్ అంటే ఇంకా చాలా ఇష్టం. నా జీవితంలో ఒక్కసారి అయినా మెగా ఫోన్ పట్టుకోవాలని నా కోరిక. అయితే ఎప్పుడైతే మెగా ఫోన్ చేపట్టాలని అనుకుంటానో ఆ సమయంలో ఒక ఏడాదిపాటైన సినిమా నటనకు బ్రేక్ ఇస్తాను.
మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తాను. ఆ విధంగా సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలకువలు నేర్చుకుంటాను. ఇప్పటికే నా మదిలో చాలా కథలు ఉన్నాయి. అయితే నటిగా ముందు మరికొన్ని సినిమాల్లో నటించాలని ఉంది. అందుకని ప్రస్తుతం డైరెక్షన్ డిపార్ట్మెంట్ పై కాకుండా కేవలం నటనపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది.
మొత్తానికి ఈ యంగ్ హీరోయిన్ మెగా ఫోన్ చేపట్టాలనే తన కోరికను బాహాటంగా స్వయంగా వెల్లడించింది. మరి ఈమె నటించే చిత్రాల్లాగానే ఈమె డైరెక్షన్ చేయబోయే చిత్రం కూడా మంచి అభిరుచి గల చిత్రమై ఉంటుందా.. లేదా.. అనేది తెలియాలంటే.. ఆమె మెగా ఫోన్ పట్టే వరకు వెయిట్ చేయక తప్పదు.