Site icon vidhaatha

Jacqueline-Sukesh | లవ్‌ యూ మై బేబి గర్ల్‌..! బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌కు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌..!

Jacqueline-Sukesh | బాలీవుడ్‌ బ్యూటీ (Bollywood Beauty) జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ (Sukesh Chandrashekar)తో సంబంధాలతో వివాదాల్లో చిక్కుకున్నది శ్రీలంకన్‌ బ్యూటీ. ఇప్పటికే ఈ కేసులో జాక్వెలిన్‌తో పాటు నోరా ఫతేహి (Nora Fatehi)ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) విచారించింది. ప్రస్తుతం సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఫోర్టిన్‌ మాజీ ప్రమోటర్‌ భార్య నుంచి రూ.200కోట్లు దోపిడీకి పాల్పడ్డాడన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో జైలులో ఉన్నాడు. అయితే, తాజాగా సుకేశ్‌ చంద్రశేఖర్‌ నటి జాక్వెలిన్‌కు ఓ లేఖ ద్వారా హోలీ (Holi) శుభాకాంక్షలు తెలిపాడు. లేఖను తన న్యాయవాది ద్వారా మీడియాకు విడుదల చేశాడు. లేఖలో, సుకేష్ చంద్రశేఖర్ మీడియా మిత్రులు, కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, స్నేహితులతో పాటు తనను ద్వేషిస్తున్న వారికి సైతం హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నాడు.

నీ జీవితంలో మాయమైన రంగులు 100 రెట్లు తిరిగి వస్తాయ్‌..

జాక్వెలిన్‌కు ప్రత్యేకంగా హోలీ శుభాకాంక్షలు తెలిపాడు సుకేశ్‌. అంతమైన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) కు హోలీ శుభాకాంక్షలు. రంగుల పండుగ హోలీ సందర్భంగా నేను నీకు మాటిస్తున్నా. నీ జీవితంలో మాయమైన రంగులు వంద రెట్లు తిరిగి వస్తాయి. దానికి పూర్తి బాధ్యత నాదే. నా బేబి గర్ల్‌ కోసం నేను ఎంత వరకైనా తెగిస్తానని నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నా మై గర్ల్‌. కీప్‌ స్మైలింగ్‌. లవ్‌ యూ మై ప్రిన్సెస్‌. మిస్‌ యూ లోడ్స్‌. మై డాల్‌. నా ప్రియతమా.. మై జాకీ’ అంటూ లేఖను సుకేశ్‌ రాశాడు. సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఇంతకు ముందు ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున సైతం జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)కు ప్రేమ లేఖ రాశాడు.

సుకేశ్‌పై జాక్వెలిన్‌ ఆరోపణలు..

సురేశ్‌ చంద్రశేఖర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టుకు హాజరైంది. ఈ సందర్భంగా షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. సుకేశ్‌ చంద్రశేఖర్‌ తాను సన్ టీవీ ఓనర్‌గా పరిచయం చేసుకున్నాడని, జయలలిత తన అత్తగా చెప్పుకున్నాడని చెప్పింది. తనకు వీరాభిమానినని, తాను సౌత్‌ ఇండియాలో సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు సుకేశ్‌ తనకు చెప్పాడని జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez) కోర్టుకు తెలిపింది. చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, సౌత్‌లో కలిసి పని చేసేందుకు ప్రయత్నించాలని, జైలు నుంచి సైతం తనకు సుకేశ్‌ ఫోన్‌ చేసేవాడని చెప్పుకొచ్చింది. అతను జైలు నుంచి ఫోన్‌ చేస్తున్నాడని గానీ, జైలులో ఉన్నాడని గని తనకు ఎప్పుడూ చెప్పలేదని, ఎప్పుడూ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఒకే కర్టెన్‌, ఒకే సోఫాలో కూర్చుండి ఫోన్‌ చేసేవాడని చెప్పుకొచ్చింది.

Exit mobile version