Jammu and Kashmir | క‌శ్మీర్‌కు1.27 కోట్ల ప‌ర్యాట‌కులు: లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా

Jammu and Kashmir రికార్డు స్థాయిలో ప‌ర్యాట‌కుల రాక‌ శాంతి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొల్ప‌డం వ‌ల్లే సాధ్య‌మైంది లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా విధాత‌: జమ్ముక‌శ్మీర్‌కు రికార్డుస్థాయిలో ప‌ర్యాట‌కులు వ‌స్తున్నార‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా చెప్పారు. ఈ ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కే 1.27 కోట్ల మంది ప‌ర్యాట‌కులు క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌ని తెలిపారు. డిసెంబ‌ర్ వ‌ర‌కు ప‌ర్యాట‌కుల సంఖ్య ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయికి పెరుగ‌వ‌చ్చ‌ని అంచనా వేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. జ‌మ్ముక‌శ్మీర్‌లో శాంతి, సాధార‌ణ […]

  • Publish Date - August 2, 2023 / 01:59 AM IST

Jammu and Kashmir

  • రికార్డు స్థాయిలో ప‌ర్యాట‌కుల రాక‌
  • శాంతి, సాధార‌ణ ప‌రిస్థితులు
  • నెల‌కొల్ప‌డం వ‌ల్లే సాధ్య‌మైంది
  • లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా

విధాత‌: జమ్ముక‌శ్మీర్‌కు రికార్డుస్థాయిలో ప‌ర్యాట‌కులు వ‌స్తున్నార‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా చెప్పారు. ఈ ఏడాది నుంచి ఇప్ప‌టి వ‌ర‌కే 1.27 కోట్ల మంది ప‌ర్యాట‌కులు క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చార‌ని తెలిపారు. డిసెంబ‌ర్ వ‌ర‌కు ప‌ర్యాట‌కుల సంఖ్య ఎప్పుడూ లేనంత రికార్డు స్థాయికి పెరుగ‌వ‌చ్చ‌ని అంచనా వేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

జ‌మ్ముక‌శ్మీర్‌లో శాంతి, సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొన‌డం వ‌ల్ల ప‌ర్యాట‌కుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్నట్టు ఎల్జీ బుధ‌వారం మీడియాకు వెల్లడించారు. ప‌ర్యాట‌కుల‌కు అవ‌స‌ర‌మైన అన్నివ‌స‌తులు యూటీలో ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు.

ఈ ఏడాది మొద‌టి నుంచి కూడా వ్యాపార కార్య‌క‌లాపాలు సాధార‌ణంగా సాగుతున్నాయ‌ని చెప్పారు. రాష్ట్ర‌వ్యాప్తంగా శాంతియువ వాతావ‌ర‌ణం నెల‌కొన‌డంతో విద్యాసంస్థ‌లు సక్ర‌మంగా సాగుతున్నాయ‌ని వెల్ల‌డించారు.

Latest News