Bairstow | ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ చాలా ఉత్కంఠగా సాగగా విజయం ఆసీస్‌ని వరించింది. రెండో టెస్ట్‌లోను విజయం సాధించాలని కంగారులు భావిస్తున్నారు. రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుంది. అయితే ఆట ప్రారంభమైన మొదట్లో ఊహించని సంఘటన జరిగింది.
అండర్సన్ తొలి ఓవర్ వేయగా, ఈ ఓవర్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లోకి సడెన్‌గా ఇద్దరు నిరసనకారులు దూసుకొచ్చారు. అయితే వారి చేతుల్లో ఉన్న ఆరెంజ్ కలర్ ను చల్లుతూ.. ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో.. ఓ నిరసనకారుడిని అమాంతం ఎత్తుకుని బౌండరీ లైన్ అవతల పడేశాడు.
ఇంకొక నిరసనకారుడిని స్టోక్స్ నిలువరించగా, అదే సమయంలో సెక్యూరిటీ గ్రౌండ్‌లోకి వచ్చి వాళ్లని తీసుకు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. అయితే నిరసన కారులు అలా చేయడం వెనక కారణం ఏంటంటే.. ఇంగ్లాండ్ లో పర్యావరణ పరిరక్షణ కోసం ‘జస్ట్ స్టాప్ ఆయిల్’ అనే గ్రూప్ ఉద్యమం చేస్తుంది.
2022 మార్చి నుండి ఈ ఉద్యమం చేస్తూనే ఉన్నారు. యూకేలోని ఇంధన సంస్థలకి ఇష్టమోచ్చినట్టు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఈ గ్రూప్ వ్యతిరేఖిస్తుంది. ఇష్టమొచ్చినట్టు ఇలా లైసెన్స్ లు ఇచ్చుకుంటూ పోతే పర్యావరణం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వారు నిరసనలు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్స్ స్టీవెన్ స్మిత్(85 నాటౌట్), ట్రావిస్ హెడ్(77), వార్నర్(66) అర్ధ సెంచరీలు సాధించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 339 స్కోరు చేసింది. ఈ టెస్ట్‌లో భారీ స్కోర్ చేయాలనే కసితో ఉన్న స్మిత్ టెస్టుల్లో తొమ్మిది వేల పరుగుల మైలురాయిని కూడా అందుకున్నారు.
This needs to stop!! Go on Bairstow!!