Site icon vidhaatha

డిజాస్టర్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది….!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పలువురు స్టార్ హీరోలు నటించిన నాలుగైదు చిత్రాలు కూడా రీ రిలీజ్ లు అయ్యాయి. అయితే ఈ విధంగా విడుద‌లైన చిత్రాలు ఎక్కువగా మంచి విజయం సాధించిన చిత్రాలే కావడం విశేషం. కానీ కోలీవుడ్ లో విశ్వ నటుడు కమలహాసన్ నటించిన విడుదలైన ఓ చిత్రం రీ రిలీజ్కు రెడీ అవుతుంది. తమిళనాట 22 ఏళ్ల కిందట వచ్చిన ఆళవంధాన్ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో కమలహాసన్ ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు సురేష్ కృష్ణ దర్శకుడు కాగా ఎస్. థాను అప్పట్లోనే భారీ బడ్జెట్ తో రూపొందించారు.

ఈ చిత్రాన్ని అభ‌య్ పేరుతో తెలుగులో జయకృష్ణ డబ్బింగ్ చేశారు. కానీ ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కానీ ఆనాడు ఆ చిత్రం సక్సెస్ కాలేదని, అదే చిత్రం ఇప్పుడు విడుదలయితే మంచి ఆదరణ లభించడం ఖాయమని దర్శక నిర్మాతలు భావించారు. ఈ చిత్రానికి నాడు ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ గాను జాతీయ అవార్డు వచ్చింది. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా స్క్రీన్ లలో ఈ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అప్పట్లో అభయ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రాన్ఏని భారీ ధ‌ర‌కు తెలుగు రైట్స్ కొన్న జ‌య‌కృష్ణ నాడు తీవ్రంగా న‌ష్ట‌పోయి ఆర్ధిక ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. ఇప్పటి ప్రేక్షకులకు అభయ్ నచ్చే విధంగా ఉంటుందని ఒరిజిన‌ల్ వెర్ష‌న్ తీసిన సురేష్ కృష్ణ‌, థానులు భావిస్తున్నారు.

నేటి జ‌న‌రేష‌న్ టేస్ట్ కి అనుగుణంగా వారికి త‌గ్గ‌ట్లు సౌండ్, పిక్చర్ క్వాలిటీ మార్చి రీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ విష‌యాన్ని త్వరలో అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కమలహాసన్ కు జోడిగా మనీషా కొయిరాలా, ర‌వీనాటాండ‌న్లు నటించారు. త్వ‌ర‌లో రీరిలీజ్ డేట్ ను కూడా అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించే ప‌నిలో ఉన్నారు. అప్పట్లో ఈ సినిమాకు శంకర్ ఎహ‌సాన్ లాయ్ సంగీతం అందించారు. అట్టర్ ఫ్లాప్ అయిన అభయ్ రీరిలీజ్ లో అయినా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో వేచి చూడాలి…..!

Exit mobile version