విధాత: దేశంలో కాంగ్రెస్ కు పునరుత్తేజం కలిగించేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రకు ప్రజల్లో మంచి స్పందన వస్తోంది. వేలాదిగా ప్రజలు రాహుల్ వెంట కదులుతున్నారు. యువ కార్యకర్తలు సైతం రాహుల్ చేపడుతున్న జోడో యాత్రలో హుషారుగా పాల్గొంటున్నా సీనియర్, వృద్ధ నాయకులు మాత్రం ఈ యాత్రతో ఇబ్బంది పడుతున్నారు. తమ అసంతృప్తిని ప్రయివేటు డిస్కషన్లలో వాళ్లు వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాటుకుని మధ్యప్రదేశ్ లో సాగుతున్న జోడో యాత్ర విషయమై సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా చేసిన కమల్ నాథ్ ఇప్పుడు 70 ఏళ్లు పైబడి ఉంటాయి. ఈ వయసులో ఆయన నడిచేందుకు ఆరోగ్యం.. ఉత్సాహం కొరవడింది అనే నేపథ్యంలో ఆయన కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
‘జోడో యాత్ర’ షెడ్యూల్‌పై కమల్‌నాథ్ అసహనంగా మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘గత వారం రోజులుగా మేం చచ్చిపోతున్నాం’’ అని ఆయన అన్నట్లుగా వీడియో ఉంది.
ఆ వీడియోలో కమల్‌నాథ్.. ప్రదీప్ మిశ్రా అనే వ్యక్తితో మాట్లాడుతూ ‘‘గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నాం. రోజూ ఉదయం 6 గంటలకే యాత్ర ప్రారంభించాలి. రోజుకు కనీసం 24 కిలోమీటర్లు నడవాలి’’ అని కమల్ నాథ్ పేర్కొన్నారు.
అంతేగాక, మధ్యప్రదేశ్‌లో యాత్ర కోసం రాహుల్ మూడు ప్రీ కండిషన్లు పెట్టారని కమల్‌నాథ్ అన్నారు. ఆదివాసీ వీరుడు తాంత్య భిల్ జన్మస్థలం, ఓంకారేశ్వర, మహంకాళీ ఆలయాలను సందర్శించాలని రాహుల్ షరతు పెట్టారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొన్ని స్థానిక మీడియా సంస్థలు సోషల్‌మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
కాగా.. మధ్యప్రదేశ్ జోడో యాత్రలో కమల్‌నాథ్.. రాహుల్ వెంటే ఉన్నారు. రాహుల్‌తో కలిసి ఓంకారేశ్వర, ఉజ్జయిని మహంకాళీ ఆలయాలను దర్శించుకున్నారు. మొత్తానికి పాపం సీనియర్ నేత నడవడానికి ఇబ్బంది పడుతున్నట్లున్నారు. అందుకే ఇలా అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు.
"We Are Dying…": Kamal Nath’s Bharat Jodo ‘Confession’ Draws BJP Jab https://t.co/bZxdgsjCOT via @ndtv
— Anurag Dwary (@Anurag_Dwary) December 1, 2022