Site icon vidhaatha

ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్.. ఆ తర్వాత ఏం జ‌రిగిందంటే..?

విధాత‌: గ‌త కొన్నేండ్ల నుంచి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది కామ‌న్ అయిపోయింది. ప్ర‌తి జంట కూడా ఉన్నంతలో, త‌మ‌కు అనుకూలంగా ఉన్న లోకేష‌న్ల‌లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసి ఆ జ్ఞాప‌కాల‌ను ప‌దిలంగా ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక కొంద‌రైతే ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్‌కు భారీగా ఖ‌ర్చు చేస్తుంటారు. మ‌రికొంద‌రైతే ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో, నిషేధించబ‌డిన ప్రాంతాల్లో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసి ఇబ్బందుల పాల‌వుతుంటారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ప్ర‌తి రోజు ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉంటాయి. అయితే ఓ జంట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి చెందిన ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. సీన్ క‌ట్ చేస్తే ఆ యువ డాక్ట‌ర్ ఉద్యోగం ఊడిపోయింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.


వివ‌రాల్లోకి వెళ్తే.. క‌ర్ణాట‌క చిత్ర‌దుర్గ‌లోని బరామాసాగ‌ర్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో డాక్ట‌ర్ అభిషేక్ జాయిన్ అయ్యారు. ఫిజిషియ‌న్‌గా ప‌ని చేస్తున్న ఆయ‌న‌కు ఇటీవ‌లే పెళ్లి కుదిరింది. దీంతో తన వృత్తిలోనే వినూత్నంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు అభిషేక్ ప్లాన్ చేశారు. ఇక తాను ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోని ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ను అందుకు ఎంచుకున్నారు.

Exit mobile version