Site icon vidhaatha

Karnataka win | శక్తిమంతమైన ప్రేమకు ఫలితం.. కాంగ్రెస్‌ విజయంపై రాహుల్‌గాంధీ

Karnataka win

విధాత: కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపు.. ఆశ్రిత పక్షపాతంపై ప్రజాబలం సాధించిన విజయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సంబురాల్లో ఉన్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రేమ ముందు ద్వేషం ఓడిపోయిందని అన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే జరుగబోతున్నదని చెప్పారు. ‘మనం కర్ణాటక ఎన్నికల్లో ద్వేషంతో కాదు.. ప్రేమతో పోటీ చేశాం. ఇప్పుడు అక్కడ విద్వేషాల దుకాణం మూతపడింది. ప్రేమ ఉన్న దుకాణం తెరుచుకుంది’ అని వ్యాఖ్యానించారు. పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు రాహుల్‌ ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version