Site icon vidhaatha

Karunakar Reddy | హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించి! నిన్న అపహరణకు గురైన కరుణాకర్‌రెడ్డి హత్య కేసులో ట్విస్ట్‌లు

విధాత‌: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్‌లో నిన్న రాత్రి అపహరణకు గురైన కరుణాకర్‌రెడ్డి (Karunakar Reddy)ని దుండగులు దారుణంగా హత్య చేశారు. దుండగులు ఆయనను కారులో అపహరించారు.

ఆయన చంపి, ప్రమాదంగా చిత్రీకరించి గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చేర్పించి దుండగులు పరారయ్యారు. అప్పటికే కరుణాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

కరుణాకర్ రెడ్డి మృతిపై వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకర్‌రెడ్డిని చితకబాది చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యకు స్థానిక ప్రజాప్రతినిధే కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

భూ లావాదేవీల్లో అక్రమాలు వెలుగు చూస్తాయనే హత్య:

కొత్తూరు ఏసీపీ కుషాల్కర్ కరుణాకర్ రెడ్డి హత్య వివరాలను కొత్తూరు ఏసీపీ కుషాల్కర్‌ వెల్లడించారు. ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి అక్రమాలు బైటికి వస్తాయనే హత్య చేశారు. కరుణాకర్‌రెడ్డి గతంలో మధుసూదన్‌ అనుచరుడిగా పనిచేశారు. భూ లావాదేవీల్లో అక్రమాలు వెలుగు చూస్తాయనే హత్య చేశారు. కొత్తూరు ఎంపీపీపై, విష్ణువర్ధన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి, ఆరీఫ్‌లపై కేసు నమోదు చేసినట్టు ఏసీపీ తెలిపారు.

Exit mobile version