Brs Mlc Kavitha: అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దంపతులు తమ కుమారుడు ఆధిత్య స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికాలోని వేక్ ఫారెస్ట్ విశ్వవిద్యాలయంలో జరిగిన తన కుమారుడు ఆదిత్య స్నాతకోత్సవానికి కవిత తన భర్త డాక్టర్ అనిల్ కుమార్, చిన్న కొడుకు ఆర్యన్ తో కలిసి హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసు నేపథ్యంలో సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో కవిత అమెరికాకు వెళ్లారు.
కుమారుడు ఆదిత్య స్నాతకోత్సవం ఆనందాన్ని కవిత సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “నీ చిన్న చేయి పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం చూడటం వరకు, ఎంత అద్భుతమైన ప్రయాణం ఆదిత్య. నువ్వు చాలా కష్టపడి పనిచేశావు, చాలా ఎదిగావు, మనందరినీ గర్వపడేలా చేశావు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను! అభినందనలు అధిత్య అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు కవిత ఈ నెల 23న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. 26వ తేదీన డల్లాస్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కేటీఆర్ అమెరికా వెళ్లబోతున్నారు.