Site icon vidhaatha

Madhuyashki Goud: కవిత బీజేపీ వదిలిన బాణం : కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి

స్కామ్ లను కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం
జాగృతిలో రూ.800కోట్ల కుంభకోణం
జాతిపిత కేసీఆర్ కాదు..జయశంకర్
వ్యాపార పెట్టుబడులకే అమెరికాకు కేటీఆర్
మొక్కల సంతోష్ ఇప్పుడు మొక్కలు ఎందుకు నాటడం లేదు
బీఆర్ఎస్ అంటేనే బందీ పోటు దొంగల పార్టీ
రాష్ట్రం రాకముందు..వచ్చాక కల్వకుంట్ల ఆస్తులపై విచారణ జరిపించాలి
మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్స్

విధాత, హైదరాబాద్ : లిక్కర్ క్వీన్ కవిత బీజేపీ వదిలిన బాణమని..బీజేపీ వ్యూహ రచనలో భాగమే కవిత లేఖ అని..రాష్ట్రంలో బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందన్నది ప్రధాని మోదీ స్ట్రాటజీ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాధుయాష్కి ఆరోపించారు. సోమవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ కేసునుండి బయట పడటానికి బీజేపీ సహకారం కవితకు కావల్సి ఉందని..ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మోదీతో సెల్పీ లు దిగుతూ తిరిగిందని..బీజేపీతో కలిసి కాంగ్రెస్ ను ముంచాలని చూస్తుందని మధుయాష్కి ఆరోపించారు. కవితపై నిజామాబాద్ లో జీఎస్టీ స్కామ్ ఉందని, కవిత జాగృతి సంస్థలో 800 కోట్ల అవినీతి జరిగిందని..దీనిపై విచారణ జరుపాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పేరుతో కేంద్రం నుంచి నిధులు తీసుకుని స్వాహా చేసిందని మధుయాష్కి ఆరోపించారు. జాగృతి పేరు మీద కవిత భారీగా వసూళ్లు చేసిందని..అవినీతి సొమ్మును జాగ్రత్త చేసుకోవడానికి కవిత జాగృతి బలోపేతం అంటుందని..తన అవినీతి ని కప్పి పుచ్చుకోవడానికి లేఖ..జాగృతి అంటూ కొత్త నాటకం మొదలు పెట్టిందని విమర్శిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చనిపోయిన రైతులకు, ఉద్యమకారులకు ఆర్థిక సహాయం చేస్తానని కవిత చేయలేదని ఆరోపించారు.

కవితకు వేలకోట్ల ఆస్తులు ఎక్కడివి

కవితకు బంజారాహిల్స్ లో 2వేల కోట్ల ఆస్తులు, విల్లాలు ఎక్కడివని మధుయాష్కి ప్రశ్నించారు. బ్యూటీ పార్లర్ నడిపే కవితకు వేల కోట్లు ఎక్కడివని నిలదీశారు. అయ్యప్ప సొసైటీ లో ఆంధ్ర వాళ్ల నుంచి దగ్గర డబ్బులు వసూలు చేసిందని ఆరోపించారు. జాగృతి తరుపున మహిళలు, బలహీన వర్గాల కోసం పోరాటాలు చేస్తామన్న కవిత కాశ్మీర్ లో యువతిపై అత్యాచారం జరిగితే మహిళగా ఆనాడు ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. కవిత ను కాంగ్రెస్ లో చేర్చుకొనే అంత ఖర్మ మా పార్టీకి పట్టలేదన్నారు. తెలంగాణ జాతి పీత కేసీఆర్ అని కవిత అంటుందని..నిజమైన జాతిపిత జయశంకర్ మాత్రమేనన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పార్టీ ఆఫీసులో కనీసం జెండా ఎగవేయలేదని..ఆయనకు తెలంగాణ సాధన కంటే ముఖ్యమంత్రి కావాలన్నదే ఏకైక లక్ష్యంగా ఉండేనని మధుయాష్కి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక కుటుంబంతో సోనియా గాంధీ కాళ్లు మొక్కి ముఖ్యమంత్రి కావాలనే నా జీవిత లక్ష్యం నెరవేరిందనని..పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్నాడని మధుయాష్కి తెలిపారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లోనే కల్వకుంట్ల కుటుంబం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని..తెలంగాణ రాష్ట్రం రాకపోతే కవిత బ్యూటీ పార్లర్ పెట్టుకొని బ్రతికేదన్నారు. కవిత లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్, అమ్ ఆద్మీ పార్టీ భాగస్వామ్యులని, బీఆర్ఎస్ అంటేనే బందీ పోటు దొంగల పార్టీ అని విమర్శించారు. అవినీతిలో కల్వకుంట్ల కుటుంబానికి సహకరించిన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై జీఎస్టీ కేసు ఉందన్నారు.

కల్వకుంట్ల కుటుంబం ఆస్తులపై విచారణ జరిపించాలి

కేటీఆర్ కు అమెరికా, దుబాయ్ లో పెట్టుబడులు ఉన్నాయని..అందుకే రాష్ట్ర అవతరణ వేళ రాష్ట్రంలో ఉండకుండా..అమెరికాలో వ్యాపార పెట్టబడులు పెట్టుకోవడానికి పోయాడని మధుయాష్కి ఆరోపించారు. మొక్కల సంతోష్ రావు ఇప్పుడు మొక్కలు ఎందుకు నాటడం లేదో ప్రజలు ఆలోచించాలన్నారు. అసలు తెలంగాణ వచ్చాక.. రాక ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్నో తేల్చేందుకు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని తాను సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణను దోచుకున్న రాబంధుల పార్టీ బీఆర్ఎస్ పైన, వాళ్లకు వంత పాడిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మధుయాష్కి ప్రభుత్వాన్ని కోరారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న సోమ్ముకు శిక్ష ఒక్కటే సరిపోదన్నారు.

Exit mobile version