విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్య సమస్యలతో మరోసారి యశోద ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల నిమిత్తం వైద్యుల సూచన మేరకు గురవారం కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యులు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 3న కూడా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. అప్పడు బ్లడ్ షుగర్, సోడియం స్థాయిలు మానిటర్ చేయడానికి రెండ్రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఈనెల 5న డిశ్ఛార్జి అయ్యారు.
వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని, తర్వాత తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిశ్చార్జి సమయంలో వైద్యులు తెలిపారు. ఈక్రమంలో వైద్య పరీక్షల కోసం కేసీఆర్ మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు.