ఏ జిల్లాలో మెడికల్‌ కాలేజీలున్నాయో KCRకే తెలియదు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ‌న్‌

విధాత‌: తెలంగాణలో మెడికల్‌ కాలేజీలో ఏ జిల్లాలో ఉన్నాయో తెలియదా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. అమృతకాల బడ్జెట్‌ అంశంపై దూరదర్శన్‌ న్యూస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లకే చేరాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జోకులు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. 2014లో తెలంగాణ అప్పులు ఎంత? […]

  • Publish Date - February 16, 2023 / 04:07 PM IST

విధాత‌: తెలంగాణలో మెడికల్‌ కాలేజీలో ఏ జిల్లాలో ఉన్నాయో తెలియదా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. అమృతకాల బడ్జెట్‌ అంశంపై దూరదర్శన్‌ న్యూస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన డీడీ డైలాగ్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. చేతులు జోడించి చెబుతున్నా.. భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లకే చేరాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ జోకులు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. 2014లో తెలంగాణ అప్పులు ఎంత? ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. 2014లో తెలంగాణకు రూ. 60 వేల కోట్ల అప్పులు ఉండగా.. ఇప్పుడు రూ. 3 లక్షల కోట్ల అప్పులున్నాయని తెలిపారు.

రాష్ట్రాల అప్పులను కంట్రోల్‌ చేసే బాధ్యత రాజ్యాంగం కేంద్రానికి ఇచ్చందిని దాన్నే తాము అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏ జిల్లాలో మెడికల్‌ కాలేజీలు లేవో పేర్లు పంపాలని కోరితే పంపకుండా ఇప్పుడు బాధ పడితే ఏం లాభమని ప్రశ్నించారు.

మెడికల్‌ కాలేజీలు లేని జిల్లా పేర్లు కోరితే వైద్య కళాశాలలు ఉన్న ఖమ్మం, కరీంనగర్‌ పేర్లను పంపారు. అందుకే తిరస్కరించి పంపామని, ఇప్పటికీ కొత్త జిల్లాల పేర్లు పంపలేదన్నారు. ఏ జిల్లాలో మెడికల్‌ కాలేజీలు ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదని ఎద్దేవా చేశారు.

నో డేటా అవైలబుల్‌ ప్రభుత్వం అంటే ఏవరిదో ఇప్పుడు అందరికీ తెలుసన్నారు. నంబర్లు, ప్రాజెక్టులు చూసుకొని బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడాలని కేంద్ర మంత్రి సూచించారు.