విధాత: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరి కాసేపటిలో రాజ్‌భవన్‌కు బయల్దేరుతారని తెలుస్తున్నది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆరెస్ ఓటమి నేపథ్యంలో ఆయన గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజ్‌ను కలిసి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖ అందిస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామాతో మంత్రి మండలి రద్దవుతుంది.
సాధారణంగా.. కొత్త ప్రభుత్వం ఏర్పటు అయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరుతారు. నిజానికి ఓట్ల లెక్కిపు మరునాడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించేది తామేనని పార్టీ శ్రేణుల్లో ధీమా కల్పించేందుకే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేశారన్న చర్చ జరిగింది. అయితే.. ఆదివారమే కేసీఆర్ రాజీనామా చేసిన పక్షంలో సోమవారం క్యాబినెట్ ప్రసక్తే ఉండదు.