Keerthy Suresh | Keerthy Suresh | ప్రస్తుతం దక్షిణాది భామలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే సమంతా, రష్మిక మందన్నా, నయనతార, రాశీఖన్నా సహా పలువురు హిందీ చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు. అదేబాటలో మరో దక్షిణాది హీరోయిన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. వరుస విజయాలతో జోరుమీదున్న ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేశ్ త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నది. వరుణ్ ధావన్ హీరోగా నటించనున్న VD18 చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ చిత్రాన్ని జవాన్ దర్శకుడు అట్లీ నిర్మాణ సంస్థతో పాటు కబీర్ సింగ్ నిర్మాతలు సినీ-1 స్టూడియోస్ కలిసి నిర్మించబోతున్నాయి.
యాక్షన్ ఎంటర్‌టైన్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తున్నది. అట్లీ కంపెనీ ఏ ఫర్ ఆపిల్ ప్రొడక్షన్‌పై దర్శకుడు అట్లీ భార్య ప్రియా అట్లీ నిర్మించనున్నారు. అలాగే మురాద్ ఖేతాని సంస్థ సినీ స్టూడియోస్ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనున్నది. ఈ సంస్థ ఇటీవల ‘కబీర్ సింగ్’, భూల్ భూలయ్య-2, గుమ్రా తదితర చిత్రాలను నటించింది. అలాగే టీ సిరీస్‌తో కలిసి ‘యానిమల్’ చిత్రాన్ని సైతం తెరకెక్కిస్తున్నది. భారీ బడ్జెట్‌తో VD18 చిత్రాన్ని తెరక్కించనుండగా.. వరుణ్ ధావన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తున్నది.
ఇందులో కీర్తి సురేశ్ పేరు ఫైనల్ కాగా.. మరో హీరోయిన్‌ను త్వరలో ఎంపిక చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే, చిత్రబృందం ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఇక కీర్తి సురేశ్ ఇటీవల వరుస చిత్రాలతో జోరుమీదున్నది. ఇటీవల ‘దసరా’లో వెన్నెలగా ప్రేక్షకులను తనదైన నటనతో మెప్పించింది. అలాగే మెగెస్టార్ చిరంజీవికి చెల్లిగా ‘భోళాశంకర్’లో నటించనున్నది. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుద కానున్నది. ప్రస్తుతం కన్నెవేది, రఘుతాత, రివాల్వర్ రీట, సైరన్ తదితర చిత్రాల్లో నటించనున్నది.