హైదరాబాద్: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం-1, 2లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. పీజీటీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ), టీజీటీ(ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్), ప్రైమరీ టీచర్స్-పీఆర్‌టీ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ కేవీ-1లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఇక కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్(తైక్వాండో, ఖోఖో, అథ్లెటిక్స్, కబడ్డీ, యోగా), నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, ఎడ్యుకేషన్ కౌన్సెలర్, డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ కేవీ-2లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
పైపోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాల్సి ఉంటుంది. ఒక సెట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకెళ్లాలి. అభ్యర్థులు 24న ఉదయం 8:30 గంటల వరకు ఉప్పల్ కేంద్రీయ విద్యాలయాలు-1,2కు చేరుకోవాలి. తదితర వివరాల కోసం