హైదరాబాద్: అందరూ ఊహించిన విధంగానే ముఖ్యమంత్రి పదవి టీపీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డినే వరించింది. ఇవాళ రాత్రి 7 గంటలకు రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లో జరగనుంది. రేవంత్ చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రమాణం చేయించనున్నారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం జరిగిన సీఎల్పీ సమావేశంలో.. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.