Site icon vidhaatha

Komatireddy | సీనియర్లపై దుష్ప్రచారం.. తెలంగాణలోనూ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkata Reddy |

విధాత: సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీనియర్లు లక్ష్యంగా దుష్ప్రచారం చేయడం జరుగుతుందని దీనికి బాధ్యులైన వ్యక్తులపై పార్టీ చర్యలు తీసుకోవడం సరైనదేనని మాజీ మంత్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా ట్రోలింగ్ చేయడం బాధాకరమన్నారు.

కర్ణాటక ఎన్నికల మాదిరిగా తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీ నాయకులంతా ఐక్యంగా పనిచేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని, ఈటెలను, పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నానన్నారు

Exit mobile version