Site icon vidhaatha

Kondagattu: జైశ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించిన ‘కొండగట్టు’

విధాత బ్యూరో, కరీంనగర్: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయం కాషాయ రూపు సంతరించుకుంది.
చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు.
హనుమాన్ మాలధారులు, సాధారణ భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కొండగట్టు పరిసర ప్రాంతాలు జైశ్రీరామ్ నినాదాలతో ప్రతిధ్వనించాయి.

తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా,తదితర రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మాలధారులు కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు లక్ష పైగా భక్తులు
ఆలయాన్ని సందర్శించారు.

స్వామివారి జయంతిని పురస్కరించుకొని గురువారం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గర్భగుడిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు, ఆలయ సిబ్బంది వాకీటాకీలతో ఎప్పటికప్పుడుపరి స్థితిని పరిశీలించారు.

జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ అడిషనల్ కలెక్టర్లు మంద మకరంద్,bs లత జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ఈవో వెంకటేష్, సిఐ రమణమూర్తి, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో600 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Exit mobile version