KTR | నేతన్నల సంక్షేమానికి.. ప్రభుత్వం చేయూత: పోచంపల్లిలో మంత్రి కేటీఆర్‌

KTR | నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చేయూత పోచంపల్లిలో మంత్రి కేటీఆర్‌ త్వరలో చేనేత రుణాల మాఫీ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన బీఆరెస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం రాదంటు జోస్యం విధాత: చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అం చారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు నేతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తిగా […]

  • Publish Date - August 12, 2023 / 12:32 AM IST

KTR |

  • నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చేయూత
  • పోచంపల్లిలో మంత్రి కేటీఆర్‌
  • త్వరలో చేనేత రుణాల మాఫీ
  • అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
  • బీఆరెస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం రాదంటు జోస్యం

విధాత: చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ అం చారు. రుణమాఫీపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చేనేత ప్రకటించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించి రుణమాఫీ అమలుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు నేతన్నల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ చేనేత వృత్తిని ప్రొత్సహించేందుకు సంక్షేమ, ప్రోత్సాహాక పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

చేనేత కార్మికుల అభివృద్ధి కోసం నేతన్నకు చేయూత, త్రిఫ్ట్, నేతన్న భీమా, చేనేత లక్ష్మీ, పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. పోచంపల్లిలో శనివారం మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో కలిసి నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు.

హ్యాండ్లూమ్ పార్కు పునరుద్ధరణ యూనిట్‌కు, మున్సిపాల్టీలో 60కోట్లతో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు, సీసీరోడ్లు, డ్రైనేజీలకు, ధోభీ ఘాట్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించి ప్రసంగించారు.

కేటీఆర్ మాట్లాడుతు గతంలో కనుముక్కుల గ్రామంలో మూతపడిన పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును ప్రభుత్వం 12 కోట్ల 50 లక్షలతో కొనుగోలు చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని, దీనిని లాభాల్లోకి తెచ్చి, ఆ లాభాలను చేనేతలకు అందిస్తామన్నారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్ టైల్స్‌ క్లస్టర్ మాదిరి పోచంపల్లి నేతన్నలు పోచంపల్లి చేనేతల అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతుంటే తాము దివాళా తీసిన పోచంపల్లి చేనేత పార్కును కొనుగోలు చేసి లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మోడీ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసి చేనేతల మెడకు ఉచ్చు బిగించిందని, తప్పకుండా మోడీకి బుద్ధి చెప్పాల్సివుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల పిదప కేంద్రంలో బీఆరెస్‌ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు కాదని, అప్పుడు అన్ని సమస్యలపై యుద్ధం చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఢిల్లీకి బానిసలని, దద్దమ్మలన్నారు.

ఢిల్లీలో కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు ఉండాలని, అప్పుడు దేశం యావత్తు బాగుంటుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికులకు, ప్రతి నెల 3 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నామని, 75 ఏళ్ల వయస్సు వరకు చేనేతలకు భీమా అమలు చేస్తున్నామన్నారు.

త్రిఫ్ట్ పథకం ద్వారా డబ్బులు అందిస్తున్నామని, మగ్గాలను ఆధునికరిస్తూ, అధునాతన మగ్గాలను తెలంగాణ చేనేత మగ్గం పథకం ద్వారా అందిస్తామన్నారు. చేనేత హెల్త్ పథకం తెచ్చామని, ఉప్పల్ లో చేనేత కళా రూపాల ప్రదర్శన శాల ను నిర్మిస్తున్నామని, కోకాపేటలో నేతన్నల భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. రైతు రుణమాఫీ చేస్తుండటంతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని, 19వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామన్నారు.

చేనేత కార్మికుల రుణమాఫీ పై కూడా సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారని, తాను కూడా దీనిపై సీఎంతో చర్చించి నేతన్నల రుణమాఫీకి కృషి చేస్తానన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హాయంలోనే పోచంపల్లి మున్సిపాలిటీగా అభివృద్ధి చెందిందని, మీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అభివృద్ధి చాలా బాగా చేస్తున్నాడని, మళ్లీ భువనగిరి గడ్డపై గులాబీ జెండా ఎగురాలన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధిని కాంక్షిస్తు చేనేత యూనిట్ ని ఏర్పాటు చేసిన భగత్ బృందానికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నేతన్నల గుండె చప్పుడు తెలిసినందునే ఉద్యమ కాలంలోనే సీఎం కేసీఆర్‌ ఉద్యమ నాయకుడిగా భూదాన్ పోచంపల్లి, సిరిసిల్లలో పర్యటించి చేనేత కార్మికులను ఆదుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఆదరణ, గుర్తింపు లేక పోవడంతో ఆత్మాభిమానంతో అప్పులు చెయ్యలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కలత చెందిన కేసీఆర్ నాడు ఉద్యమ నాయకుడిగా జోలె పట్టుకుని వసూలు చేసిన మొత్తాలతో చేనేత కార్మికులకు అండగా నిలిచిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. అందుకే అధికారంలోకి వచ్చిందే తడవుగా సమస్యను సత్వరమే అర్థం చేసుకోగలిగిన కేటీఆర్‌ను చేనేత జౌళిశాఖ మంత్రిగా నియమించారన్నారు.

మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ఎటు చూసినా కనిపించేది చేనేత కార్మికులేనని, అందుకే ఆయన చేనేత సంక్షేమానికి అవగాహానతో కృషి చేస్తున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సహా కేంద్రంలోని యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొండి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సహా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

Latest News