విధాత : ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లు శుక్రవారం నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆధార్ ఈకేవైసీలు పనిచేయకపోవడంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు స్తంభించాయి.
దీంతో జనం రిజిస్ట్రేషన్ ఆఫీసుల మందు పడి కాపులు పడ్డారు.ఈ రోజంతా రిజిస్ట్రేషన్లు అయ్యే అవకాశం లేదని అధికారులు చెప్పడంతో రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ కోసం వచ్చిన కొనుగోలు, అమ్మకం దారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు.