Site icon vidhaatha

Maharashtra | విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. న‌లుగురు మృతి

Maharashtra

విధాత‌: మ‌హారాష్ట్ర‌లో వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. ముంబై, పరిసర ప్రాంతాలుసహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వాన‌లు ప‌డుతున్నాయి. భారీ వర్షాల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు చ‌నిపోయారు. ముగ్గురు గాయప‌డ్డారు.

బుధవారం 100కి పైగా లోకల్ రైళ్లను రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ (IMD) రాయ్‌ఘడ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్‌ జిల్లా ఖలాపూర్‌ తహసీల్‌లోని ఇర్షల్‌వాడి గ్రామంలో అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఘ‌ట‌నాస్థ‌లాన్ని సంద‌ర్శించిన సీఎం

ఈ ఘ‌ట‌న‌లో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే గురువారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సంతాపం తెలిపారు.

థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో భారీ వర్షపాతం హెచ్చరిక కారణంగా ముంబై, థానే, రాయ్‌ఘడ్, పాల్ఘర్‌తో సహా నాలుగు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది

Exit mobile version