Site icon vidhaatha

లోక్‌స‌భ నుంచి 33 మంది ఎంపీల స‌స్పెన్ష‌న్‌


విధాత‌: లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమ‌వారం కూడా పార్ల‌మెంట్‌లో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ ప్రారంభం కాగానే స్పీక‌ర్ పోడియం ఎదుట ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ నేప‌థ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరితో సహా 32 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.


లోక్‌స‌భలో భ‌ద్ర‌తా లోపంపై గ‌త‌వారం నుంచి విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌డుతూ వ‌స్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా స్పందించాల‌ని డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. విప‌క్ష స‌భ్యుల ఆందోళ‌న‌ల‌తో స‌భ వ‌రుస‌గా వాయిదాప‌డుతూ వ‌స్తున్న‌ది. సోమ‌వారం కూడా విప‌క్ష ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో 30 మంది విప‌క్ష స‌భ్యుల‌ను స్పీక‌ర్ స‌స్పెండ్ చేశారు.

Exit mobile version