Site icon vidhaatha

Bhimavaram | టీడీపీ కార్యకర్తల వీరంగం.. భీమవరం గరం.. గరం!

Bhimavaram |

విధాత‌: మీరెన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే మీకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాను అని హామీ ఇచ్చిన లోకేష్ మాటలకు స్ఫూర్తి పొందిన టీడీపీ కార్యకర్తలు వీలైనచోటల్లా వీరంగం వేస్తున్నారు. గతంలో పుంగనూరులో చంద్రబాబు యాత్ర సందర్బముగా జరిగిన గొడవలో దాదాపు పాతికమంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనలో పుంగనూరు టిడిపి ఇంచార్జ్ చల్లా బాబుతోబాటు దాదాపు 250 మంది మీద కేసులు నమోదయ్యాయి. చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్లంతా ఇప్పుడు కేసులు .. కోర్టులు అంటూ తిరుగుతున్నారు. ఇక యువగళం పాదయాత్ర భీమవరం చేరుకున్న నేపథ్యంలో లోకేష్ అనుచరులు అక్కడ వీరంగం సృష్టించారు.

వైసిపి కార్యకర్తలమీద దాడులు చేయడంతోబాటు జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చించేస్తూ గందరగోళం సృష్టించారు. రాళ్లు, కర్రలతో దాడులు చేస్తూ పట్టణంలో భయానక వాతావరణం సృష్టించారు. దీంతో అటు వైసిపి కార్యకర్తలు, పోలీసులు సైతం ఎదురుదాడి ప్రారంభించడంతో అక్కడి పరిస్థితి భయానకంగా మారింది.

మొన్న పుంగనూరులో జరిగినట్లే నేడు భీమవరంలో సైతం ఇరువర్గాలూ కొట్లాడుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గులు పోలీసులు గాయపడ్డారు. అయితే రాత్రికిరాత్రే పోలీసులు దాదాపు యాభై మంది యువగళం కార్యకర్తలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లోకేష్ సైతం అక్కడ కార్యకర్తలకు మద్దతుగా మాట్లాడుతూ రెచ్చగోట్టారన్నది పోలీసుల ఆరోపణ.

Exit mobile version