TDP | చంద్రబాబు లోకేష్‌లకు.. IT తలనొప్పులు..

TDP | కాంట్రాక్టర్ల నుంచి కోట్లు కొట్టేశారంటూ ఆధారాలు వైసిపికి అందివచ్చిన అవకాశం.. చంద్రబాబుపై రాజకీయ దాడి ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా తాను ఎక్కడా రూపాయి లంచం తీసుకోలేదని, తనది తెరచిన పుస్తకం వంటి జీవితం అని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దొరికిపోయారు. ఆయనతోబాటు కుమారుడు లోకేష్ సైతం దొరికిపోయారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు పలు కాంట్రాక్టు సంస్థలకు పనులు ఇచ్చినందుకుగానే ప్రతిగా రూ. 118 కోట్లు చంద్రబాబు తీసుకున్నట్లు, లోకేష్ సైతం […]

  • Publish Date - September 5, 2023 / 11:17 AM IST

TDP |

  • కాంట్రాక్టర్ల నుంచి కోట్లు కొట్టేశారంటూ ఆధారాలు
  • వైసిపికి అందివచ్చిన అవకాశం.. చంద్రబాబుపై రాజకీయ దాడి

ఇన్నాళ్లు.. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నా తాను ఎక్కడా రూపాయి లంచం తీసుకోలేదని, తనది తెరచిన పుస్తకం వంటి జీవితం అని చెబుతూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు దొరికిపోయారు. ఆయనతోబాటు కుమారుడు లోకేష్ సైతం దొరికిపోయారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు పలు కాంట్రాక్టు సంస్థలకు పనులు ఇచ్చినందుకుగానే ప్రతిగా రూ. 118 కోట్లు చంద్రబాబు తీసుకున్నట్లు, లోకేష్ సైతం రూ. 25 కోట్లు తీసుకున్నట్లు ఐటి అధికారులు గుర్తించి నోటీసులు ఇవ్వడంతో విషయం బయటికి వచ్చింది.

చాన్నాళ్ల క్రితమే ఈ నోటీసులు అందుకున్న చంద్రబాబు దాన్ని కప్పి పుచ్చుకుందాం అనుకున్నా కుదర లేదు. ఎట్టకేలకు బయట పడడంతో తన పరువుకు ఇబ్బంది కలుగగా ఇటు వైసిపికి ఒక అవకాశం అందివచ్చినట్లు అయింది. దీంతో ఆయన్ను రాజకీయంగా బదనాం చేసేందుకు సాక్షితో బాటు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

వాస్తవానికి ఆంధ్రలో హైకోర్టు, సచివాలయం, ఇంకా పలు జిల్లాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.7,700 కోట్ల విలువైన కాంట్రాక్టు పనులు లార్సర్ అండ్ టూబ్రో ఇంకా షాపూర్జీ పల్లోంజీ సంస్థలకు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయా సంస్థలకు కన్సల్టెంట్ మనోజ్ వాసుదేవ్ పార్థసాని నుంచి చంద్రబాబు రూ. 118 కోట్లు తీసుకున్నారు. ఈ మేరకు డబ్బును తన పీఏ శ్రీనివాస్ అందుకున్నారు.

ఈ విషయాలన్నీ ఆ మధ్య ఐటీ అధికారులు మనోజ్ పార్థసాని ఆఫీసులు, ఇంటిలో జరిపిన దాడుల్లో గుర్తించారు. అందులో ఎప్పుడెప్పుడు ఎంత డబ్బు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ కు ఇచ్చింది స్పష్టంగా ఆధారాలు దొరికాయి. విశాఖ, బెంగళూరు, విజయవాడ, హైద్రాబాదుల్లోని తనవారికి డబ్బు ఇవ్వాల్సిందిగా చంద్రబాబు సూచించిన మేరకు మనోజ్ పార్థసాని ఆ డబ్బును అందించినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సంపాదించారు.

ఇక లోకేష్ సైతం తన అనుచరుడు కిలారు రాజేష్ ద్వారా రూ. 4.5 కోట్లు తీసుకున్నారు. ఆర్వీఆర్ ఇన్ఫ్రా సంస్థ అధినేత రఘు రేలా ద్వారా కూడా మనోజ్ వాసుదేవ్ మరో. రూ. 20.18 కోట్లు లోకేష్ కు ఇచ్చినట్లు ఐటి అధికారులు గుర్తించారు.

ఈమేరకు చంద్రబాబుకు ఐటి అధికారులు నోటీసులు ఇవ్వడం ఆంధ్రాలో సంచలనం అయింది. దీంతో ఇదిప్పుడు చంద్రబాబుకు ఇబ్బందికరంగా పరిణమించగా అటు వైసిపికి ఇది ఒక అవకాశంగా మారింది. దీంతో బాబును బదనాం చేసేందుకు సాక్షితోబాటు వైసిపి సోషల్ మీడియాను బాగా వాడుకుంటోంది.

Latest News