Site icon vidhaatha

Prabhas: ప్ర‌భాస్ క‌ల్కిలో ఊహించ‌ని స్టార్స్.. అతిధి పాత్ర‌లలో అద‌ర‌గొట్టేస్తారంతే..!

Prabhas: ప్ర‌భాస్ న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఒక‌టి. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొన్న‌టి వ‌ర‌కు ప్రాజెక్ట్ కె పేరుతో వార్త‌ల‌లో నిలిచింది. రీసెంట్‌గా గ్లింప్స్ విడుద‌ల చేసి మూవీకి ‘కల్కి 2898 ఏడీ’ అనే పేరు పెట్టిన‌ట్టు తెలియ‌జేశారు.

ఇక గ్లింప్స్ చూస్తే మూవీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంద‌నే క్లారిటీ వ‌చ్చింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సన్నివేశాలతో హిందూ పురాణాల స్పూర్తితో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దు తున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకోణ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి స్టార్స్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రి కొంత మంది స్టార్స్ కూడా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించి వినోదం పంచ‌ బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో మహేష్ బాబు, సూర్య, దుల్కర్ సల్మాన్ స్టార్ వంటి న‌టులు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌బోతున్నార‌ని నేష‌న‌ల్ మీడియా చెబుతుంది.

మ‌రి దీనిపై యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ మూవీ నిర్మాణానికి సుమారు రూ.600 కోట్ల వరకూ ఖర్చు చేస్తుండ‌గా, ఈ మూవీ ఇప్పటి వరకూ భారత దేశంలో తెరకెక్కిన అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒక‌టిగా చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ ఒక్క‌డే రూ.150 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇక ఇందులో విల‌న్‌గా న‌టిస్తున్న క‌మ‌ల్ హాస‌న్ రూ.40 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారని సమాచారం. ఇక ఈ సినిమా టైటిల్ కల్కి వెనక ఉన్న క‌హానీ చూస్తే.. హిందూ పురాణాల్లో మహా విష్ణువు అవతారాల్లో పదో అవతారం కల్కిగా చెబుతారు.

మాములు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి వీర ఖడ్గంతో, తెల్లని గుర్రంపై స్వారీ చేస్తూ, దుష్టులను శిక్షిస్తాడని కల్కి అవతారం గురించి పురాణాలు చెబుతున్నాయి. దీని ఆధారంగానే నాగ్ అశ్విన్ త‌న‌దైన స్టైల్‌లో సినిమాని తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఆంగ్లంలో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు

Exit mobile version