Site icon vidhaatha

Mann Ki Baat | ‘మన్‌కీ బాత్‌’ సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదిక: మోడీ

Mann Ki Baat

విధాత‌: దేశవ్యాప్తంగా ప్రజలు మన్‌కీ బాత్‌(Mann Ki Baat) కార్యక్రమంలో భాగస్వాములయ్యారని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఇందులో చర్చించామని ప్రధాని నరేంద్రమోడీ (PM Narendra Modi) అన్నారు. ‘మన్‌కీ బాత్‌’ వందో ఎపిసోడ్‌ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. సామాన్యుల సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. అసమాన్య సేవలు అందిస్తున్న ప్రజలతో మాట్లాడే అవకాశం లభించింది.

హరియాణాలో స్త్రీ, పురుష నిష్పత్తి గురించి చర్చలు జరిగేవి. బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం హరియాణా నుంచే ప్రారంభించాను. దేశంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. నదులు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి.

పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత పర్యాటకానికి ఊతమిస్తుందన్నారు. విదేశాలకు వెళ్లే ముందు దేశ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి. దేశంలో కనీసం 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలన్నారు.

ప్లాస్టిక్‌, ఈ చెత్త గురించి పలుమార్లు చర్చించాం. యునెస్కో డీజీ మనకు కొన్ని ప్రశ్నలు సంధించారు. విద్య, సంస్కృతి గురించి సమస్యలు లేవనెత్తారు. నాణ్యమైన విద్య కోసం జాతీయ విద్యావిధానం తీసుకొచ్చామని చెప్పారు. సాంకేతికతను జోడించి విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం. సమష్టి కృషితో సమూల మార్పులు వస్తాయన్న విశ్వాసం ఉన్నదని ప్రధాని తెలిపారు.

Exit mobile version