IRCTC | మంచు కొండలు, తులిప్ పూల అందాలు చూడాలనుకుంటున్నారా.. హైదరాబాద్ నుంచి కాశ్మీర్‌కు ఐఆర్‌సీటీసీ స్పెషల్ ట్రావెల్ ప్యాకేజీ!

IRCTC Kashmir Tour Package | ఈ వేసవిలో కాశ్మీర్ అందాలు, తులిప్ పరిమళాలు ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, తులిప్ ఫెస్టివల్ చూడవచ్చు.

IRCTC Kashmir tour package tulip garden Dal Lake shikara snow mountains Hyderabad package

“కాశ్మీర్ తులిప్ పూల అందాలు, దాల్ సరస్సులో శికారా ప్రయాణం – IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ”

IRCTC Kashmir Tour Package | ఈ వేసవిలో కాశ్మీర్‌లో మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, తులిప్ (Tulip) పూల పరిమళాలను ఆస్వాదించాలని అనుకుంటున్నారా? మీలాంటి ఔత్సాహికుల కోసం ఐఆర్‌సీటీసీ మంచి అవకాశం కల్పించింది. ‘మిస్టికల్ కాశ్మీర్ తులిప్ ఫెస్టివల్ స్పెషల్’ (Mystical Kashmir Tulip Festival Special ) పేరుతో హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మార్చి 26వ తేదీన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ పర్యటనలో శ్రీనగర్(Srinagar), గుల్మార్గ్(Gulmarg), సోనమర్గ్(Sonmarg), పహల్గామ్(Pahalgam) వంటి కశ్మీర్ అందాలను ఆస్వాదించే అవకాశం ఉంది.

ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరి శ్రీనగర్ చేరుకుంటారు. ఐదు రాత్రులు, ఆరు రోజుల పర్యటన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఈ ప్యాకేజీ కంఫర్ట్ క్లాస్‌లో అందుబాటులో ఉంది.

ప్యాకేజీ ధరలు ఎంతంటే..

ఈ టూర్ (IRCTC Kashmir Tour Package) కోసం ఐఆర్‌సీటీసీ పెద్దల నుంచి ఒక్కొక్కరికీ రూ.53,565 (సింగిల్ ఆక్యుపెన్సీ) వసూలు చేస్తుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.43,435; ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.42,010 చార్జ్ చేస్తున్నారు. ఇక ఐదు నుంచి 11 సంవత్సరాల లోపు పిల్లలకు బెడ్‌తో అయితే రూ.36,520; బెడ్ లేకుండా అయితే రూ.33,905 చార్జ్ చేస్తున్నారు.

రోజు వారీ టూర్ ప్లాన్ ఇదీ

మొదటి రోజు: హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరి శ్రీనగర్ చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ చేసి విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం స్వేచ్ఛగా గడపవచ్చు. రాత్రికి అదే హోటల్‌లో డిన్నర్ ఉంటుంది.

రెండో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం శ్రీనగర్‌ నుంచి సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉండే సోనమర్గ్‌కు బయల్దేరి వెళ్తారు. మార్గమధ్యలో మంచుతో కప్పబడిన పర్వతాలు, నదులు, లోయలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. థాజివాస్ గ్లేసియర్ ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. సోనమర్గ్ సందర్శన అనంతరం రాత్రికి శ్రీనగర్ చేరుకుని అక్కడే హోటల్‌లో బస చేస్తారు.

మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం గుల్మార్గ్‌కు వెళ్లి ప్రపంచంలోనే ఎత్తైన గోండోలా కేబల్ కారు ప్రయాణం చేయవచ్చు. ఖిలన్‌మార్గ్ ట్రెక్కింగ్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. దాని తర్వాత మళ్లీ శ్రీనగర్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు.

నాలుగో రోజు: బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చెక్‌అవుట్ చేసి పహల్గామ్‌కు బయల్దేరి వెళ్తారు. సముద్రపు మట్టానికి 2440 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశానికి వెళ్తున్న సమయంలో కుంకుమపువ్వు తోటలు, అవంతిపురం శిథిలాలు చూడవచ్చు. ఇక్కడి బీటాబ్ వ్యాలీ, అరు వ్యాలీ వంటి ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. రాత్రికి పహల్గామ్‌లోనే డిన్నర్ చేసి, బస చేస్తారు.

ఐదో రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్‌అవుట్ చేసి పహల్గామ్ నుంచి శ్రీనగర్‌కు బయల్దేరతారు. శంకరాచార్య ఆలయం, దాల్ సరస్సును సందర్శిస్తారు. దాల్ సరస్సులో శికారా రైడ్‌లో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రికి బోట్ హౌస్‌లోనే బస ఏర్పాటు చేస్తారు.

ఆరో రోజు: ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

ప్యాకేజీలో ఉండే సదుపాయాలు

* హైదరాబాద్ – శ్రీనగర్ రౌండ్ ట్రిప్ విమాన టికెట్లు
* నాలుగు రాత్రులు హోటల్‌లో + ఒక రాత్రి హౌస్ బోట్‌లో వసతి
* బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్
* స్థానిక దర్శనాలకు వాహన సదుపాయం
* టూర్ ఎస్కార్ట్ సేవలు
* ట్రావెల్ ఇన్సూరెన్స్
* టోల్, పార్కింగ్, పన్నులు

ప్యాకేజీలో లేని సదుపాయాలు

* గొండోలా రైడ్, శికారా రైడ్ చార్జీలు
* మధ్యాహ్న భోజనం
* వ్యక్తిగత ఖర్చులు
* టిప్స్, గైడ్ చార్జీలు
* హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు వరకు ట్రాన్స్‌పోర్ట్

ముఖ్య నిబంధనలు

ఈ పర్యటనకు సంబంధించి విమాన సమయాలు మారే అవకాశం ఉంటుంది. హోటల్ చెక్ ఇన్, చెక్ అవుట్ సమయాలు హోటల్ నిబంధనల ప్రకారం ఉంటాయి. పర్యాటకులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ కార్డు తెచ్చుకోవాలి. ప్యాకేజీ ధరలు పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి. ఈ సమ్మర్‌లో కశ్మీర్ అందాలను చూసే అవకాశం మిస్ చేసుకోకండి.. పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

Read More:

IRCTC Thailand Tour | హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ టూర్.. ఐఆర్‌సీటీసీ స్పెషల్ ప్యాకేజీ.. రూ.53,900 నుంచే!

IRCTC Royal Nepal Package | హైదరాబాద్ నుంచి నేపాల్ టూర్.. ఐఆర్‌సీటీసీ కొత్త ట్రావెల్ ప్యాకేజీ

IRCTC Andaman Package | హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్.. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే!

Latest News