Telangana SC Corporation | నిరుద్యోగ ఎస్సీ యువ‌త‌కు సువ‌ర్ణావ‌కాశం.. స‌బ్సిడీపై ఈవీ వాహ‌నాలు

Telangana SC Corporation | నిరుద్యోగ ఎస్సీ యువ‌త‌కు తెలంగాణ ప్ర‌భుత్వం( Telangana Govt ) శుభ‌వార్త వినిపించింది. టూ వీల‌ర్, త్రీ వీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను స‌బ్సిడీపై అందించేందుకు తెలంగాణ ఎస్సీ కార్పొరేష‌న్( Telangana SC Corporation ) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వివ‌రాలు ఇవే..

Telangana SC Corporation | నిరుద్యోగ ఎస్సీ యువ‌త‌కు ఇదొక సువ‌ర్ణ అవ‌కాశం. వాహ‌న రంగంలో స్థిర‌ప‌డాల‌నుకుంటున్నారా..? సొంతంగా త‌మ‌కంటూ ఒక వాహ‌నం ఉండాల‌నుకుంటున్నారా..? తామే డ్రైవ‌ర్ క‌మ్ ఓన‌ర్‌గా ఎద‌గాల‌నుకుంటున్నారా..? అలాంటి వారికి ప్ర‌భుత్వం శుభ‌వార్త వినిపించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను(ఈవీ) స‌బ్సిడీపై ఇచ్చేందుకు తెలంగాణ ఎస్సీ కార్పొరేష‌న్( Telangana SC Corporation ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

టూ వీల‌ర్, త్రీ వీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను స‌బ్సిడీపై పొందొచ్చ‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈవీల‌ను పొందేందుకు కావాల్సిన ధ్రువ‌ప‌త్రాల‌ను, ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించింది. అయితే ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లోనే స‌మ‌ర్పించాలి.

ముఖ్య‌మైన తేదీలు

ద‌ర‌ఖాస్తుల ప్రారంభం : మార్చి 17, 2026
ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు చివ‌రి తేదీ : మార్చి 26, 2026

అవ‌స‌ర‌మైన ప‌త్రాలు

1. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
2. ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
4. డ్రైవింగ్ లైసెన్స్‌(త‌ప్ప‌నిస‌రి)
5. ఆధార్ కార్డు మ‌రియు ఫొటోలు

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌

అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ బెనిఫిష‌రీ మేనేజ్‌మెంట్ అండ్ మానిట‌రింగ్ వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

https://tgobmms.cgg.gov.in/CommonRegistration.action

 

Latest News