Site icon vidhaatha

Dantewada I గున్నపరకొర్చోలిలో ఎన్ కౌంటర్.. బస్సును దగ్ధం చేసిన నక్సలైట్లు

Dantewada|

విధాత: తెలంగాణ, చత్తీస్‌ఘడ్ సరిహద్దు అటవీ ప్రాంతం దంతేవాడ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని గున్నపరకొర్చోలి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల సంఘటన‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం తెల్లవారుజామున మావోయిస్టులు అటుగా వెళుతున్న బస్సును దహ‌నం చేశారు. ఈ సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక పోలీసు బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మావోయిస్టు కమాండర్ వెళ్లి తన సహచరులతో సమీప అటవీ ప్రాంతంలో ఉన్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం అందుతుండగా వారి వివరాలతో పాటు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా సాయుధ పోలీసులు, ప్రత్యేక బలగాలు పరిసర ప్రాంతాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగిస్తున్నట్లు తెలిసింది. బస్సు దగ్ధం, ఎన్‌కౌంటర్ సంఘటనతో అటవీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమీపంలోని గిరిజన గూడేల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

Exit mobile version